Corona: దక్షిణ కొరియాను పట్టిపీడిస్తున్న కరోనా.. 6 లక్షలకు పైగా కొత్త కేసులు!

Corona: గత కొంత కాలం నుండి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా పట్టి పీడించిందో చూసాం. దాని ప్రభావంతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిశాయి. ఇక గత కొన్ని రోజుల నుండి దీని తీవ్రత కొంతవరకు తగ్గింది. కానీ తాజాగా మళ్లీ దీని ప్రభావం దక్షిణ కొరియాలో చుట్టుముట్టింది. ఏకంగా ఆరు లక్షలకు పైగా కొత్త కేసులు పుట్టుకొచ్చాయి.

చైనాలో కూడా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇంతలోనే దక్షిణ కొరియాలో కూడా కొత్త కేసులు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం బుధవారం నాలుగు లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. ఒక్కరోజులోనే 55 శాతానికి పైగా కేసులు పెరిగాయని తెలిసింది. ఇక గురువారం 6,21,328 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. ఒక్కరోజులోనే 429 మంది మరణించగా.. ఇంకా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది.