లోకేష్ లో మార్పు తెచ్చిన కరోనా, ఆశ్చర్యంలో వైసీపీ నాయకులు

lokesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ ఇప్పుడు టీడీపీని నడిపించే పనిలో పడ్డారు. పతనావస్థకు చేరుకున్న పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు లోకేష్ ఏ పని చేసినా కూడా ఎదో విధంగా నవ్వులపాలు అయ్యేవాడు. సరిగ్గా తెలుగు మాట్లాడకపోవడం, ప్రతిపక్షాల నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం వంటి చర్యల వల్ల లోకేష్ రాజకీయాలకు పనికి రారని దాదాపు ప్రతి ఒక్కరు వ్యాఖ్యానించారు. కానీ ఎవ్వరు తీసుకొని రాని మార్పును కరోనా లోకేష్ లో మార్పు తెచ్చింది. ఆ మార్పును చూసి టీడీపీ నాయకులతో పాటు వైసీపీ నాయకులు ఆశ్ఛర్యపోతున్నారు.

corona changed lokesh political career
lokesh

ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, ప్రజలకు దగ్గరగా

కరోనా సమయంలో వైసీపీ నాయకులు ఎలాంటి భయం లేకుండా ప్రజల దగ్గరకు వెళ్తుండేవారు కానీ లోకేష్ మాత్రం హైద్రాబాద్ లోనే ఉండే వారు. అసలు పార్టీని కూడా పట్టించుకునే వారు కాదు. ఈ విషయంపై టీడీపీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం ప్రజలకు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే అక్కడికి వెళ్తున్నారు. ప్రభుత్వంపై ప్రజా సమస్యలపై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. కరోనా తరువాత లోకేష్ లో వచ్చిన మార్పు చూసి రాజకీయ నాయకులు ఆశ్చర్యపోతున్నారు.

సభలోనూ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ..

ఇక‌, మండ‌లిలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రజావ్యతిరేక బిల్లుల‌‌ను నిలువ‌రించేలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించిన తీరును కూడా ప్రశంసిస్తున్నారు. ఒక‌ప్పుడు య‌న‌మ‌ల వంటివారు మాత్రమే మండ‌లిలో ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిస్తే.. ఇప్పుడు నారా లోకేష్ కూడా ప‌ట్టుసాధించార‌ని, స‌భా వ్యవ‌హారాల పైనా ఆయ‌న ప‌ట్టు పెంచుకుంటున్నార‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించు కుంటున్నారు. స‌భ‌లో ఎలా వ్యవ‌హ‌రించాలో.. కూడా లోకేష్ ప‌రిణితి సాధించార‌ని చెబుతున్నారు. ప్రజ‌ల్లో నిరంత‌రం ఉండేలా కూడా కార్యక్రమాలు రూపొందించుకుని ముఖ్యంగా యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు ప్రయ‌త్నిస్తు తీరుకు సొంత పార్టీ నేత‌ల నుంచి ప్రశంస‌లు వ‌స్తున్నాయి. అలాగే ఆయన ఇంకొంచెం తెలుగుపై పట్టు పెంచుకొని, అనర్గళంగా మాట్లాడితే బాగుంటుందని, అన్ని అంశాలపై పట్టు పెంచుకోవాలని లోకేష్ కు సూచనలు చేస్తున్నారు. ఇలా కరోనా లోకేష్ లో రాజకీయ పరిణితి తీసుకువచ్చింది.