ఆంధ్రప్రదేశ్‌ను కరోనా హడలెత్తిస్తుంది. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతుండడంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువ అవుతోండడమే కాకుండా కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 47645 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 7,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 56 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 96,298కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇక కరోనాతో ఇప్పటి వరకు 1041మంది ప్రాణాలు కోల్పోగా, 46,301మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా ఇళ్లకు వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 48,956 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో.. ఈసారి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1213 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో 1095 కేసులు, పశ్చిమ గోదావరిలో 859, విశాఖపట్నం 784, అనంతపురంలో 734, చిత్తూరులో 573, గుంటూరులో 547, కడప 396, కృష్ణా 332, నెల్లూరు 329, శ్రీకాకుళం 276, ప్రకాశం 242, విజయనగరం 247 కరోనా కేసులు నమోదయ్యాయి.