కేంద్రం లాక్ డౌన్ సండలింపులకు రంగం సిద్దం చేస్తోంది. మే 18 తర్వాత మరిన్ని సండలింపులతో నాల్గవ దశ లాక్ డౌన్ 4.0 కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా తో కచ్చితంగా కలిసి బ్రతకాల్సిందేనని ప్రధాని మోదీ నే వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఏంటో క్లియర్ గా అర్ధమవుతోంది. అందుకు తగ్గట్టు అధికారులు సిద్దమవుతున్నారు. ఒక్క రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాలు మినహా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పూర్తిగా క్రయ, విక్రయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ వ్యాప్తి మూడవ దశకు చేరుకుంటుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సమూహ వ్యాప్తి వల్లే తెలుగు రాష్ర్టాల్లో కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకూ భారత్ లో అధిక ఉష్ణోగ్రతలు కొంత వరకూ వైరస్ దాడిని నియంత్రించ గల్గింది. అయితే కరోనాతో దక్షిణాది సహా తెలుగు రాష్ర్టాలకు ముందుంది ముసళ్ల పండగ అని హెచ్చరింకచ తప్పదు. ఎందుకంటే జూన్ లో కేరళలో నైరుతి రుతుపవనాలు తాకుతాయి. నెలఖరు వరకూ అవి తెలుగు రాష్ర్టాల్లోకి వచ్చేస్తాయి. అప్పటి నుంచి తెలుగు రాష్ర్టాలు సహా కేరళ, బెంగుళూరు, తమిళనాడు, తెలంగాణ, ఏపీ లకు భారీ వర్షాలు తప్పవు. ఆ సమయంలో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోతుంది.
ఉష్ణోగ్ర్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో పరిస్థితి కరోనాలాంటి వైరస్ లకు పూర్తిగా అనుకూలంగా మారిపోతుంది. ఇక వర్షా కాలంలో రాని జ్వరాలు అంటూ ఉండవు. జ్వరాలకు అనుకూలమైన సీజన్ అది. వైరల్ ఫీవర్లు, టైపాయిడ్, డెంగ్యూ, మలేరియా యధేశ్చగా పంజా విసురుతాయి. దానికి తోడు కొత్త రకం కరోనా వైరస్ దాడి అంతకంతకు పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందే హంలేదు. ఇప్పటికే కరోనా అంటే మొదట ఉన్నంత భయంలేదు. ఆ పదం అలవాటుగా మారిపోవడమో! లేక లాక్ డౌన్ భరించలేక తెగింపా? అన్నది పక్కనబెడితే జనాలు ముందు పని పూర్తి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
కాబట్టి కరోనా అసలైన దాడి ఎలా ఉంటుందో రానున్న జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో చూపించనుందని అంచనా వేస్తున్నారు. సాధారణ దగ్గు, చలి, జలుబు జ్వరాలకే వర్షా కాలంలో ఆసుపత్రలన్నీ రోగులతో నిండిపోతాయి. దానికి తోడు కరోనా సోకి ఆసుపత్రికెళ్తే? పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఒకరి నుంచి మరొకరికి చాలా ఈజీగా వైరస్ అంటుకుంటుంది. కేసులు అమాంతం పెరిగిపోతాయి. వేలల్లో కేసులు లక్షల్లో..లక్షల్లో కేసులు కోట్లకు చేరుకునే అవకాశాలు మొండుగా ఉన్నాయి. అలాంటి సమయంలో హోమ్ క్వారంటైన్ తప్ప! గత్యంతరం ఉండదు.
ఎలాగూ మెడిసిన్ కూడా లేదు కాబట్టి డాక్టర్లు కూడా హోమ్ క్వారంటైన్ ఒక్కటే గత్యంతమరని చేతులెత్తెస్తారు. ఆ విషయం పక్కనబెడితే వర్షాలు తగ్గుముఖం పట్టగానే శీతాకాలం మొదలైపోతుంది. అది వైరస్ కి ఇంకా అనుకూలమైన వాతావరణం. దాదాపు జనవరి తొలి వారం వరకూ శీతల గాలులతో ముసుగేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రానున్న రోజుల్లో వీటన్నింటి ప్రజలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మహమ్మారి నుంచి కాపాడాల్సింది పైవాడు ఒక్కడే.