కాంగ్రెస్ లో .. తెలంగాణ లో రేవంత్ రెడ్డి భవిష్యత్తు పై సరికొత్త ఊహించని ట్విస్ట్ !

Revanth Reddy satires on KCR

రేవంత్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకుడు. టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఎవ్వరు ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. తన దూకుడు వ్యవహార శైలితో తెలుగు రాష్ట్రల రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తరుపున అధికార పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి, మళ్ళీ మల్కాజ్ గిరి నియోజక వర్గం నుండి ఎంపీ గా గెలిచి తన బలాన్ని నిరూపించుకున్నారు.

తన దుకుడుతో తన సొంత పార్టీ నేతలను కూడా రేవంత్ ఇబ్బందులకు గురి చేశారు. చాలా సార్లు అధిష్టానంతో చెప్పకుండానే తన సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళేవాడు. ఈ ధోరణి నచ్చని పార్టీ సీనియర్ నాయకులు ఆయనను అణచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో పీసీసీ పగ్గాలు కోసం అంతర్గత పోరు నడుస్తుంది. ఈ పోరులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ పదవిని చేపట్టిన ఉత్తమ్ కుమార్ పార్టీని బలపరచడంలో విఫలమైందని భావించిన కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం పీసీసీ పగ్గాలు వేరే వాళ్లకు అప్పగించాలని నిర్ణయించుకుంది.

ఈ పోటీలో చాలామంది నాయకులు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని మాత్రం పీసీసీ అధ్యక్షుడిగా నియమించకూడదని, ఆయన సీనియర్స్ ను కలుపుకొని నడవలేడని కాంగ్రెస్ నాయకులైన హనుమంత రావు, జగ్గా రెడ్డి లాంటి నాయకులు అధిష్టానానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్న రేవంత్ రెడ్డికి తన సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడాన్ని ఊహించలేకపోయారు. సొంత పార్టీలోనే తనకున్న వ్యతిరేకతను రేవంత్ ఎలా తొలగించుకుంటరో వేచి చూడాలి. సొంత నాయకులు తనకిచ్చిన ట్విస్ట్ కు రేవంత్ ఎలా సమాధానం ఇస్తారో వేచి చూడాలి.