సాఫీగా సాగుతున్న మానవజాతి మనుగడను కరోనా అల్లకల్లోలంగా మార్చింది. ఒక్కసారిగా కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో చాలామంది రాజకీయ నాయకులు కూడా కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. తాజాగా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ భాయ్ మహమ్మద్ భాయ్ అలియాస్ అహ్మద్ భాయ్ కరోనా వల్ల మరణించారు.
కరోనాతో చికిత్స పొందుతూ గురుగ్రామ్‌లోనిమేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మరణించారని ఆయన తనయుడు ఫైసల్ పటేల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా శరీరంలోని పలు అవయవాలు సరిగా పని చేయకపోవడం (మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నెల 15 నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. మూడుసార్లు లోక్‌సభకు, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
1949 ఆగస్ట్ 21న బారుచ్, బాంబే స్టేట్(ఇప్పుడు గుజరాత్) లో జన్మించారు. 1979లో మేమూనా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. అహ్మద్ పటేల్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అహ్మద్ పటేల్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన నాయకులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.