ఖమ్మం: ఈ రోజు మంత్రి కేటీఆర్ కమ్మం జిల్లా పర్యటన చేశారు. కానీ ఆయన పర్యటనను అడుగడుగునా అంతరాయం కలిగింది. ఒకవైపు బీజేపీ, మరొవైపు కాంగ్రెస్ నాయకులు ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య మరియు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీ నిరుద్యోగ భృతి అమలు గురించి యువజన కాంగ్రెస్ పక్షాన వినతిపత్రం ఇస్తామని జిల్లా కలెక్టర్ కు మరియు కమిషనర్ కు అనుమతి కోరినా.. అనుమతినివ్వకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని.. టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తానని ఓట్లు దండుకుని రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ నిరుద్యోగ భృతి అమలు చేయడంలో మీనమేషాలు లెక్కించడం చాలా దారుణమని కాంగ్రెస్ నాయకులు అన్నారు.దీనికి నిరసనగా కేటీఆర్ పర్యటన అడ్డుకోవడానికి యత్నించామని యువజన కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Aiming at expanding the IT industry to the Tier-II cities in Telangana, IT Minister @KTRTRS inaugurated the IT hub in Khammam today pic.twitter.com/P0fUT4tQE0
— KTR, Former Minister (@MinisterKTR) December 7, 2020
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంవల్ల ఈరోజు ఖమ్మంలో కొత్త డ్రామాలకు తెర లేపారని వారు ఆరోపించారు. ఖమ్మంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ హబ్ పెద్ద డ్రామా అని అందులో కేవలం 150 మంది కూడా లేరని.. అది కేవలం కార్పొరేషన్ ఎలక్షన్ కోసం ఆడుతున్న డ్రామా అని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్ అన్నారు.కేటీఆర్ పర్యటన అడ్డుకున్న కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, వైరా అసెంబ్లీ అధ్యక్షులు అశోక్, పాలేరు అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సంకీర్త్ రెడ్డి, భూక్యా సురేష్ నాయక్, ఖమ్మం నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ కొండూరు హృదయ్ కిరణ్, పాలేరు నాయకులు బచ్చలకూర నాగరాజు, మధిర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బిచ్చగాళ్ళ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.