తెలంగాణాలో మరో రాజకీయ పోరు సిద్దం అవుతుంది.. ఇలాంటి సమయంలో అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గం పై ఉండటం కొంత ఆసక్తిని కలిగిస్తుంది.. ఇకపోతే ఈసారి దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధానంగా మూడు పార్టీలు తలపడనున్నాయి.. ఇందులో ముఖ్యంగా టీఆర్ఎస్ నిలవగా తర్వాతి స్దానంలో కాంగ్రెస్, బీజేపి బరిలోకి దిగుతున్నాయి.. కాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేడు, బీజేపీకి కార్యకర్తలు లేరు.. అదీగాక ఇక్కడ అధికార పార్టీ చేసిన అభివృద్ధిని చూసైన మళ్లీ ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలవడం ఖాయం అనే ధీమాలో గులాభి శ్రేణులుండగా,ఈసారి ఎలాగైన ఈ ఎన్నికల్లో గెలచి తమ గెలుపు ఖాతా ప్రారంభించాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆశపడుతున్నారట..
ఇక ఇక్కడ తెలంగాణ పార్టీకి, కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వవచ్చూ.. కానీ కాంగ్రెస్‌లో అంతర్గత పోటీ చాలా నెలకొంది.. అదీగాక ఒకరికి ఒకరు సహకరించుకోక పోవడం, అన్ని విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీకి విజయాన్ని తీసుకురావాల్సిన వారే ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తుండటం వల్ల ఇక్కడి కాంగ్రెస్ లో ఉత్సాహం కరువైంది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం నిరంతరం కేసీఆర్, కేటీఆర్ వ్యవహారాలపై పోరాటం చేస్తూ, పార్టీలో ఊపు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా, ఆయనకు పార్టీ నాయకుల నుంచి సరైన సహకారం అందడం లేదు.. అందుకే కాంగ్రెస్ ప్రతిపక్షంగా సరిపెట్టుకుంటూ తెలంగాణలో బలం, బలగం రెండు ఉన్నా, పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాల కారణంగా ఆ పార్టీ విజయాన్ని దక్కించుకోలేక పోతోంది..
అయితే ఇప్పటి వరకు దుబ్బాక లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే విషయంలోనూ ఓ క్లారిటీ లేదు.. అంతే కాకుండా టీఆర్ఎస్ లోపాలను గట్టిగా ప్రశ్నించే నాయకుడు ఇక్కడ కరువయ్యారు.. ఇన్ని బలహీనతల మధ్య, బలమైన ముద్ర వేయించుకున్న టీఆర్ఎస్ ను ఢీకొట్టడం కాంగ్రెస్‌కు అయ్యేపని కాదు.. అందులో చేతిగుర్తు పార్టీలో ఒక్క రేవంత్ రెడ్డి తప్ప మిగతావారు కేసీయార్‌కు ఎదురునిలబడటంలో వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం ఉంది.. ఇన్ని ప్రతి కూల పరిస్దితుల మధ్య దుబ్బాకలో వేరే ఏ పార్టీ కూడా విజయం సాధించడం కాస్త కష్టంతో కూడుకున్నదే అని అంటున్నారు.. అదీగాక దుబ్బాకలో ఎవరు గెలుస్తారని యువకుల నుంచి పండు ముసలిని అడిగినా.. కేసీఆర్ సారూ టీఆర్ఎస్ కారు గెలుపే ఖాయం అని సమాధానం వస్తుందట.. ఇక ఏదైనా మెరాకిల్ జరిగితే కానీ ఫలితాలు తారుమారు కావు.. ఆ విషయం తెలియాలంటే ఎన్నికల వరకు ఆగవలసిందే..