2019 ఎన్నికలో పోటీచేసిన జనసేన తరుపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ . ఆ తర్వాత జనసేనకు దూరంగా ఉంటూ , అధికారపక్షము వైపు తిరుగుతున్నాడు. జనసేన కూడా ఆ ఎమ్మెల్యే విషయంలో పెద్దగా పట్టించుకోకుండా ఉంటుంది. అయితే వైసీపీకి మద్దతు ఇస్తున్న వరప్రసాద్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలుస్తుంది. జనసేనను కాదని వైసీపీ లోకి వెళ్లటంతో జనసైనికులు రాపాక మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు.
ఇక రాజోలులో వైసీపీ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇందులో ఒక వర్గంతోనే రాపాక కలిసి తిరుగుతున్నాడు. గతంలో రెండుసార్లు ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు ఒక వర్గంగా, ఎన్నికల తర్వాత రాజోలు నియోజకవర్గానికి ఇంచార్జి గా ఎన్నికైన పెనుపాటి అమ్మాజీ మరో వర్గంగా ఉంటున్నారు. రాపాక వర ప్రసాద్ జనసేన నుండి బయటకు వచ్చిన నాటి నుండి పెనుపాటి అమ్మాజీ వర్గంతో కలిసి నడుస్తున్నాడు. దీనితో బొంతు రాజేశ్వరరావు వర్గం రాపాక మీద తీవ్ర అసంతృప్తితో వుంది. నిజానికి తుని నుండి అమ్మాజీని రాజోలు తీసుకోని రావటం వెనుక రాపాక హస్తముందని తెలుస్తుంది. రాజోలు లో మెల్ల మెల్లగా రాజేశ్వరరావు ను జీరో చేసి, వచ్చే ఎన్నికల నాటికీ వైసీపీ టిక్కెట్ తాను సొంతం చేసుకోవాలనే ఆలోచనలో రాపాక ఉన్నట్లు సమాచారం, అయితే కొత్తగా వచ్చిన అమ్మాజీ ఏమి తక్కువ తినలేదు, ముందు నియోజకవర్గంలో పట్టు పెంచుకోవటం కోసం రాపాక వరప్రసాద్ సహాయం తీసుకోని, ఇప్పుడు కొంచం పట్టు పెరిగిన తర్వాత దానిని నిలబెట్టుకుంటూ మెల్ల మెల్లగా రాపాకనే దూరం పెడుతున్నారు.
తాడు తన్నేటోడు ఉంటే,వాడి తలతన్నేటోడు ఉంటాడు.. అన్నట్లు ఇప్పుడు రాజోలు రాజకీయం అలా తయారైంది. ఇక బొంతు రాజేశ్వరరావు ను పూర్తిగా జీరో చేయాలనీ చూస్తూనే , మరో పక్క ఆయనకి సానుభూతి పెరుగుతుంది. వరసగా రెండు సార్లు ఓడిపోవటంతో ప్రస్తుతం రాజోలు లో ఆయనకు ప్రజాదరణ పెరుగుతుంది. ఇదే సమయంలో నియోజకవర్గంలో రాపాక హవా తగ్గిపోతుంది. పేరుకు ఎమ్మెల్యే తప్ప అధికారాలు పెద్దగా ఏమి లేవని తెలుస్తుంది. తమ పార్టీని కాదని వెళ్ళిపోయినాడుకు జనసైనికులు వచ్చే ఎన్నికల్లో తమ ప్రతాపం ఏమిటో చూపించాలని కసిగా ఉన్నారు . గెలిచిన పార్టీలో ఉండకుండా అధికార పార్టీలోకి జంప్ చేసి, అటు ఆ పార్టీకి ఇటు ఈ పార్టీకి కాకుండా పోతున్నాడు రాపాక. ఉన్నది పాయే ..ఉంచుకుంది పాయే అన్నట్లు అయిపోయాడు… పాపం రాపాక