కరోనా వైరస్ తో ప్రపంచం అల్ల కల్లోలమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కోటికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ జనాల మీద విరుచుకుపడుతోంది. మందులేని జబ్బుగా, తన దెబ్బకు తిరుగేలేదన్నంతా స్వైర విహారం చేస్తోంది. ఇదేం జబ్బో అర్ధంకాక ప్రపంచ ఆరోగ్య సంస్థే చేతులెత్తేసింది. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో? కనిపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో? అసలు కనిపెట్టగలమో! లేదో! ఎయిడ్స్ లా ఉండిపోతుందేమోనన్న అనుమానాలు సైతం వ్యక్యం చేసింది. ఓ వైపు ప్రయోగాలు జోరుగా సాగుతున్నా సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో ప్రపంచ దేశాలు కరోనాతో కలిసి బ్రతకాల్సిందేనని డిసైడ్ అయిపోయాయి. ఈ విషయాన్ని ముందే గమనించిన అమెరికా లాక్ డౌన్ లతో ఆర్ధిక నష్టం తప్ప సాధించేది లేదని జనాల ప్రణాల్ని గాలికొదిలేసింది.
తాజాగా కరోనాని మించిన మహమ్మారి మరొకటి ప్రపంచ మీదకు దాడికి సిద్దమవుతోgదన్న వార్త సంచలనంగా మారింది. అవును నిజమే…కరోనా వైరస్ ని మించి మరో వైరస్ మానవుడిపై దాడికి రెడీ అవుతోంది. చైనా తాజా పరిశోధనల ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. ఆ వైరస్ కు జీ 4 అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించి అమెరికా సైన్స్ జర్నల్ ఓ ప్రత్యేక కథనం వెలువరించడం ప్రపంచాన్ని కలవర పెడుతోంది. జీ4 జన్యుపరంగా హెచ్ 1 ఎన్ 1 జాతి నుంచి వచ్చిందని అధ్యయనంలో తేలింది. మానవుడికి సోకడానికి అనుకూలంగా ఉన్న వైరస్ అని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా నిర్ధారించింది. 2011 నుంచి 2018 వరకూ 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆసుపత్రుల్లో పందుల కళేబారాల నుంచి 30,000 నాజల్ శ్వాబ్స్ ను తీసుకుని 179 స్లైన్ ప్లూ వైరస్ లను ఐసోలేట్ చేసారు.
వాటిలో ఎక్కువ సంఖ్యలో కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ కూడా మనుషులకు సోకితే ప్రాణం పోక తప్పదంటున్నారు. అయితే వాటిపై విస్తౄతంగా పరిశోధన అవసరమని తెలిపారు. ఈ వైరస్ మూడు జాతుల సమ్మేళనం. ఒకటి యూరోపియన్, ఆసియా, పక్షలలో కనిపించే మాదిరిగా ఉందని, రెండవది 2009 కి చెందిన హెచ్ 1 ఎన్ 1 జాతి అని, మూడవది ఏవియన్ హ్యూమన్, పిగ్ ఇన్ ప్లూఎంజా వైరస్ జన్యువుతో కలిగిన ఉత్తర అమెరికా హెచ్ 1 ఎన్ 1 అని తేల్చారు. ఇప్పటికే ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని స్పష్టం చేసారు. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా? లేదా? అన్న దానికి ఆధారాలు లేవన్నారు. ఈ వైరస్ కూడా సాధారణ జలుబు, దగ్గు, జ్వరం లక్షణాల్నే కలిగి ఉందన్నారు. దీంతో మానవాళి మనుగడుకు మరో పెద్ద ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.