`ఒకే ఒక్కడు` సినిమాలో ఒక్క రోజు సీఎంగా ఉంటే ? ఎన్ని పనులు చేయోచ్చో? అవినీతిని ఎలా అరికట్టొచ్చో? ప‌్రజలకు సేవ అనేది ఎలా చెయోచ్చో? ఆ సినిమాలో నటించి చేసి చూపించాడు యాక్షన్ కింగ్ అర్జున్. ఆ సినిమాలో సీఎం పాద్రధారి అయిన రఘువరన్ ఒక టీవీ కెమెరా మెన్ కి ఇచ్చిన ఆఫర్ అది. ఒక్క రోజు అంటే 24 గంటలు…ఈ సమయంలో ఎన్ని పనులు చేయోచ్చో అన్ని చేసి చూపిస్తాడు అర్జున్. ఆ దెబ్బకి అతన్నే సీఎంగా ఉండాలని ప్రజలు కోరడం మరో హైలైట్. అయితే ఇలాంటి ఆఫర్ ఒకటి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ప్రజలకి ఇచ్చారు. ప్రజల్లోంచి ఎవరైనా ఒకరు రండి. ఒక్క రోజు నా పోస్ట్ లో ఉండండి.
జిల్లా సమస్యలు తీర్చండి అంటూ ఆఫర్ చేసారు కలెక్టర్ పోలా భాస్కర్. ఒంగోలులోని తాజాగా కలెక్టర్ వర్తకులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో నాకంటే గొప్పగా ఎవరైనా చేయగలిగితే రండి. ఒక రోజు మీకు ఆఫర్ ఇస్తున్నానంటూ ఒకే ఒక్కడు సీన్ గుర్తు చేసారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వ మార్గదర్శకాలను తాను అమలు చేస్తున్నానన్నారు. ఇలాంటి సమయంలో కలెక్టర్ గా పనిచేయడం అంత ఈజీ కాదు..మీలో ఆ సత్తా ఉంటే రండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కానీ ఆఫర్ కోసం ఎవరు ముందుకు రాలేదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి జిల్లా స్థాయిలో యంత్రాంగం ఎంత బిజీగా ఉందో తెలిసిందే.
క్రింద స్థాయి ఉద్యోగుల నుంచి కలెక్టర్ వరకూ రేయింబవళ్లు పనిచేస్తున్నారు. అయినా లోపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల్లో కలెక్టర్లు సరిగ్గా పనిచేయలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే ప్రకాశం జిల్లా కలెక్టర్ తన బాధ్యతల్ని ప్రజలకి అప్పగించాలనుకున్నారు. ప్రకాశం జిల్లాలో కొవిడ్ ఆసుపత్రులు అత్యంత దయనీయంగా ఉన్నాయని..డాక్టర్లు, ఇతర సిబ్బంది రోగుల్ని పట్టించుకోలేదని తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.