Nithin : ఈ మధ్య మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్‌గా నటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలోని లోటు పాట్లను ఎత్తి చూపుతూ తనవంతుగా వ్యవస్థ మార్పుకు కృషి చేయాలనుకున్న ఓ కలెక్టర్ కథ అది.
చాలా పవర్‌ఫుల్‌గా డైలాగులు రాశారు. అన్నీ వాస్తవాలే అయినా ఎందుకో జనాలకి కనెక్ట్ కాలేదు ఆ సినిమా. నిజానికి అది సినిమా కాదు, నిఖార్సయిన నిజం మాత్రమే. కానీ, ఈ కథకు శాడ్ ఎండింగ్ ఇవ్వడంతో సినిమాలా కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు జనం.
ఇక ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’ అంటూ మరో హీరో నితిన్ మళ్లీ కలెక్టర్ కథతోనే మన ముందుకు రాబోతున్నాడు. రాజశేఖర రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే, సినిమాలో రక్తపాతానికి ఎక్కు స్కోప్ వున్నట్లే తెలుస్తోంది.
అప్పట్లో మోహన్‌బాబు హీరోగానూ కలెక్టర్ కథాంశంతో సినిమా వచ్చింది అప్పట్లో అది సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈ జనరేషన్ జనాలకి తేజు కలెక్టర్ చిత్రం నచ్చలేదు. బహుశా రక్తపాతం ఎక్కువయ్యిందనేమో..
లేదా మన తెలుగు సినిమా ఫార్ములా అస్సలు ఒప్పుకోలేని శ్యాడ్ ఎండింగ్ కథాంశమో తెలీదు కానీ, మొత్తానికి జనాల ఆదరణ అయితే దక్కించుకోలేకపోయాడు. మరి, నితిన్ కూడా అదే తప్పు చేస్తాడా.? లేక ఇంకేదైన కొత్తదనం చూపిస్తాడా.? చూడాలిక.