జగన్ ప్రకోపం : వాళ్ళంతా లైవ్ లో లేరు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు అనే మొహమాటం కూడా లేకుండా తలంటేశాడు ..! 

 

ఏపీలో వైసీపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం చాలా సత్ఫలితాలను ఇస్తుందన్న విషయం తెలిసిందే.. ఏదో తూతూ మంత్రంగా ప్రారంభించినట్లుగా కాకుండా ఈ కార్యక్రమాన్ని పకడ్బంధీగా అమలుచేస్తున్నారు వైఎస్ జగన్.. దీని వల్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు నేరుగా విన్నవించుకునే అవకాశం లభించింది.. ఇలా చేయడం వల్ల అధికారుల పని తీరులో మార్పు మాత్రమే కాకుండా ప్రజలకు సైతం తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక భరోసా వచ్చిందని వైఎస్ జగన్ సర్కార్ భావిస్తోంది. కాబట్టే ప్రతి సోమవారం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేసేందుకు ఆన్లైన్ సేవలు సైతం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారట.. అందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించారట ఏపీ సీయం జగన్..

ఇకపోతే స్పందన కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న వైఎస్ జగన్ పోయినసారి కలెక్టర్ల తీరుపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. కానీ ఈ సారి కొంత సీరియస్‌గానే స్పందించారట.. కాగా గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే విషయంలో జాయింట్‌ కలెక్టర్లు కాస్త నెమ్మదిగా ఉన్నారని, కనీసం వారానికి నాలుగుసార్లు అయినా సచివాలయాలు సందర్శించి నివేదికలు పంపాలని, ఎందుకంటే అవి గ్రామ స్థాయిలో పౌర సేవలకు ఎంతో కీలకం కాబట్టి. గ్రామ, వార్డు సచివాలయాల ప్రాతిపదికనే కలెక్టర్లు, జేసీల పని తీరును అంచనా వేస్తాం అంటూ అక్షింతలు వేశారట..

ఇక గతంలో అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నవంబరు 2వ తేదీకి వాయిదా వేసినప్పటికి, అక్టోబర్‌ 5వ తేదీనే పిల్లలకు విద్యా కానుక కిట్‌లు అందజేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇకపోతే స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా ఇలా పలు అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు..