వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య రచ్చ ముగిసినట్టేనా?

YSR Congress Party

ఇప్పటికే జరగాల్సిన రచ్చ జరిగింది. ఇంకా రచ్చ అయితే రాజకీయంగా ఎదగడం కష్టం అనుకున్నారేమో ఏమో రాజీకొచ్చేశారట. ఇష్టాయిష్టాలను పక్కన బెట్టి ఇగోలని విడిచిపెట్టి కుటీంభసమేతంగా వెళ్లి కలిసి పనిచేస్తే పోలా అని సర్దుకుపోయారట. ఇక పై ఎలాంటి విషయాలైన కలిసి కూర్చొని సెటిల్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసారట. ఇంతకీ ఎమ్మెల్యే యంపీ ఎవరనుకుంటున్నారా?

Nandigam Suresh and Sreedevi

గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న అంతర్గత కుమ్ములాట పై వైసీపీలో హాట్ హాట్ చర్చ జరుగుతుంది. ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారే అయినా బహిరంగంగా గొడవలు పడటం మామూలైపోయింది.

వీళ్ళ మధ్య గొడవ పార్టీ పెద్దలకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఇద్దరినీ కలిసి పనిచేసుకోవాలని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించారు కూడా. అయినా అక్కడ ఓకే అంటూ బయటకురాగానే షరా మాములే అన్నట్లు రోడేక్కేవారు. ఇసుక విషయం లో ఎమ్మెల్యే శ్రీదేవి ఎంపీ సురేష్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. రెండు వర్గాలు పరస్పరం పోలీసులకి ఫిర్యాదు చేసుకోవడం గొడవలు పడడం జరిగింది.

ఆ సమయంలో ఇద్దరిమధ్య పార్టీ పెద్దలు రాజీ కుదిర్చారు. ఇదిలా ఉండగానే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు శ్రీదేవి కి పెద్ద తలనొప్పిగా మారాయి. పేకాట శిబిరంలో ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు చిక్కడంతో ఎంపీ సురేష్ ఆ సమాచారాన్ని ఇచ్చి రైడ్ చేయించినట్లు ప్రచారం జరిగింది. రెండు వర్గాలు దీనిపై సోషల్ మీడియా లో పోస్టింగులు ఊదరగోట్టాయి. పొరపాట్లు సరిదిద్దుకొనే సమయంలో ముఖ్య అనుచరులును పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు శ్రీదేవి సిఫార్సు చెయ్యడంతో ఆ వివాదం కూడా తీవ్రమైంది. ఎమ్మెల్యే కు గతంలో ఆర్ధికంగా సహకరించిన రవి అనే వ్యక్తి సెల్ఫీ వీడియో పార్టీ లో చర్చకు కారణం అయ్యింది . ఇవి చాలవనట్లుగా తుళ్లూరు సీఐ ని శ్రీదేవి బెదిరించిన ఆడియో బయటకు రావడం రచ్చ రచ్చ అయింది.

ఈ వరుస వివాదాలతో పార్టీ పెద్దల నుండి శ్రీదేవి కి ఫోన్లు వెళ్లాయట. కొన్ని సార్లు ఆమె డోంట్ కేర్ అన్నా పరిస్థితి చేజారిపోతుండటంతో ఎమ్మెల్యే శిబిరం పునరాలోచనలో పడింది అంట ఈ వివాదాలన్నీ ఎంపీ వర్గం వల్లనే బయటకు వస్తున్నాయి అనే భావనలో శ్రీదేవి ఉన్నారట. అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కుటుంభసభ్యులను వెంటబెట్టుకుని సురేష్ ని కలిసేందకు ఎమ్మెల్యే ప్రయత్నించారట. అయితే శ్రీదేవి వ్యవహార శైలితో గుర్రుగా వున్న సురేష్ ఆమెతో మాట్లాడేందుకు అంగీకారాయించలేదట. దీంతో ముందుగా కుటుంబ సభ్యులన ఎంపీ దగ్గరకు పంపారట శ్రీదేవి. ఆలా రెండు సార్లు ఫామిలీ మెంబెర్స్ రాయభారం నడిపిం తర్వాతా ఆదివారం రాత్రి ఎట్టకేలకు ఎమ్మెల్యే ఎంపీ మధ్య భేటీ జరిగిందట.

ఇంతవర జరిగింది చాలు, ఇకపై మనం మనం ఒక్కటేనంటూ ఎంపీ సురేష్ ముందు ప్రతిపాదన పెట్టారట శ్రీదేవి. అయితే మొదట్లో నిర్మొహమాటంగా మాట్లాడిన సురేష్ తర్వాత కుటుంభం పరంగా వున్న బంధుత్వాలు రాజాకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓకే అన్నట్లుగా ప్రచారం కొనసాగిస్తుంది. ఇక పై ఎమ్మెల్యే ఎంపీ వర్గాలు ఒక్కటౌతాయని పార్టీ వర్గాలు అభిప్రాయం పడుతున్నాయి. అయితే గతంలోనూ ఇలాంటి రాజి ఫార్ములాలు జరిగాయి. పార్టీ పెద్దల మధ్య తలూపి మరల వివాదాల్లోకి వెళ్లేవారు. కాకపోతే ఈ సారి బంధువులు మధ్య జరిగిన ఒప్పందం కావడం తో, అది స్వయంగా శ్రీదేవి వెళ్లి మాట్లాడారు కాబట్టి ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు.