ఈ కంపెనీల ఉద్యోగులకు బంపర్ ఆఫర్ !

కరోనా కాలంలో ఉద్యోగాలు నిలబడితే చాలనుకుంటే పలు స్టాక్‌బ్రోకింగ్‌ కంపెనీల ఉద్యోగులకు మాత్రం కాసుల పంట పండనుంది. షేర్‌ మార్కెట్‌ పరుగులతో స్టాక్‌ బ్రోకరేజ్‌ సంస్థలు ఈసారి తమ ఉద్యోగులకు భారీగా బోనస్‌, ఇంక్రిమెంట్లు ప్రకటించాలని కసరత్తు సాగిస్తున్నాయి. ఇక ఈ కంపెనీలు ఏకంగా పది నుంచి ఇరవై నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించడంతో పాటు 10 నుంచి 18 శాతం వరకూ వేతన పెంపు చేపట్టాలని యోచిస్తున్నాయి.

బంపర్‌ ఆఫర్‌: ఈ కంపెనీల ఉద్యోగులకు పండగే!

డీమ్యాట్‌ ఖాతాలను తెరవడం, భారీ విలువతో ట్రేడ్‌ లావాదేవీలు నిర్వహించడం వంటి విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచేవారికి ఊహించని విధంగా 120 నుంచి ౩౦౦ శాతం వరకూ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు మరికొన్ని బ్రోకింగ్‌ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు ఆల్‌టైమ్‌ హైని చూడటంతో మెరుగైన సామర్థ్యం కనబరిచినవారికి పెర్‌ఫామెన్స్‌ ఆధారిత బోనస్‌లు అందుతాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యవస్ధాపక మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీజే జార్జ్‌ చెప్పారు.

ఇక ఈసారి తమ ఉద్యోగులకు ఆకర్షణీయ చెల్లింపులు ఉంటాయని మోతీలాల్‌ ఓస్వాల్‌, ఐఐఎఫ్‌ఎల్‌, జెరోదా వంటి బ్రోకరేజ్‌ సంస్ధల అధికారులు నిర్దారించారు. కరోనా మహమ్మారి వెంటాడినా బ్రోకింగ్‌ రంగంపై ఎలాంటి ప్రభావం లేదని, స్టాక్‌ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరాయని దీంతో ఉద్యోగులకూ మెరుగైన వేతన పెంపు ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ సుధీర్‌ ధర్‌ పేర్కొన్నారు.

ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌ కాగ్నిజెంట్ త‌న ఉద్యోగుల‌కు బోన‌స్‌లు, ప్ర‌మోష‌న్లు ప్రకటించింది. 24,000 మందికి పైగా ఉద్యోగుల‌కు ప్ర‌మోష‌న్లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. సంస్థ అట్రిషన్ తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యాన్ని కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ నంబియార్ తెలిపారు. అంతేగాక‌, సీనియర్‌ అసోసియేట్స్ స్థాయి ఉద్యోగులకు ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని యోచిస్తున్న‌ట్లు చెప్పారు.