కాక్ టెయిల్ ఇమ్యూనిటీ: జస్ట్ 59,750 రూపాయలు మాత్రమే

Cocktail Immunity Only 59,750

Cocktail Immunity Only 59,750

కరోనా వైరస్ సోకిందా.? ఇంకపై ఏం భయపడాల్సిన పనిలేదు. కాక్ టెయిల్ ఇమ్యూనిటీ వచ్చేసింది. అయితే, ఖర్చు కాస్త ఎక్కువ. ఒకే ఒక్క డోస్ సరిపోతుంది. కానీ, దానికోసం ఏకంగా 59,750 రూపాయలు ఖర్చు చేయాలి. ఈ కాక్ టెయిల్ ఇమ్యూనిటీ (యాంటీ బాడీ ఇమ్యూనిటీ) డోసు పడిందంటే, ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం కరోనా బాధితులకు అస్సలు వుండదన్నమాట. అంటే, దీన్ని కరోనా వైరస్ మీద పోరాటానికి దివ్య ఔషధంగా భావించాలా.? ఏమోగానీ, దీన్ని కేవలం ఇమ్యూనిటీ బూస్టర్ కోణంలోనే చూడాల్సి వస్తుందన్నది వైద్య నిపుణుల వాదన. ఫేస్ మాస్కు ధరించాలి.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి.. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి.

అసలంటూ, రోగాన్ని దరిచేరనీయకుండా చేసుకోవాలిగానీ, వచ్చాక ఇమ్యూనిటీ కాక్ టెయిల్ గురించో, ఇంకోదాని గురించో ఆలోచించడమెందుకు.? నిజానికి, జాగ్రత్తగా వుండడం అనే స్థాయిని ఎప్పుడో దాటేశాం. అందరం ప్రమాదంలోకి వెళ్ళిపోయాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడంలేదు గనుక, ఇక్కడ ఎవరూ సేఫ్ కాదు. ఎలాగైనా కరోనా మన మీద దాడి చేయొచ్చు. సో, కాక్ టెయిల్ ఇమ్యూనిటీ బూస్టర్ తప్పకపోవచ్చు. కానీ, దేశానికి సరిపడా కాక్ టెయిల్ ఇమ్యూనిటీ బూస్టర్ లభిస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోపక్క 3 వేల రూపాయల ధర పలికే రెమిడిసివిర్ ఇంజెక్షన్.. నల్ల బజారులో 60 వేల రూపాయల వరకూ ధర పలుకుతోంది. మరి, కాక్ టెయిల్ ఇమ్యూనిటీ డోస్ పరిస్థితేంటి.? అది ఏ పది లక్షలో పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాటు మందు కోసమే ఎగబడుతున్న జనం.. ఇలాంటి అధికారిక మందుల కోసం పోటీ పడకుండా వుంటారా.? ప్రజల అమాయకత్వమే, మందుల తయారీకి అసలు సిసలు పెట్టుబడి.