ఇలాంటి యోగాసనాలు చేస్తే చాలు.. ప్రమాదకర వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చు!

యోగా శాస్త్రం మన భారతీయుల పురాతన వారసత్వ సంపద. ఆధునిక కాలంలో దాదాపు ప్రపంచ దేశాలన్నీ యోగాసనాలను దినచర్యగా పాటిస్తున్నారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగాసనాలు చేస్తే శారీర దారుఢ్యాన్ని, మానసిక వికాసాన్ని, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. యోగాలో శ్వాసపై ధ్యాస ఉంచి
ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ఒత్తిడినీ అధిగమించవచ్చు. అలాగే గుండె జబ్బులు జీర్ణ సంబంధిత వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక రకాల వ్యాధులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపశయనం పొందవచ్చు.

ఈరోజు మనం యోగాసనాలతో శ్వాస సంబంధిత సమస్యలను ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.
రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా అనేక శ్వాస సంబంధిత వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే కొన్ని యోగాసనాలతో ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచి శ్వాస సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు.ముందుగా ప్రాణాయాయం ఎలా చేయాలో తెలుసుకుందాం.

ప్రాణాయామం చేయడానికి శ్వాస మీద ధ్యాస ఉంచి పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని చేయాలి.చేతులు చిన్‌ముద్రలో ఉండాలి. కండ్లు మూసుకుని నిదానంగా శ్వాసను పీల్చుతూ,వదులుతూ ఉండాలి.బొటన వేలితో కుడి నాసిక రంధ్రం మూస్తూ ఎడమ నాసిక రంధ్రం నుంచి శ్వాసను తీసుకోవాలి.మూడు అంకెలు లెక్కించే సమయంలో చేయాలి. మళ్లీ అదే సమయంలో వదలాలి. అలానే కుడి నాసిక రంధ్రం మూస్తూ ఎడమ నాసిక రంధ్రం ఉంచి శ్వాసను వదలాలి.ఇలా 5 నుంచి 10 సార్లు చేస్తే మనసు తేలిక పడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు పెరిగి అనేక శ్వాస సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ప్రాణాయాయంలో కొన్ని నియమాలు పాటించాలి.ఉదయం సాయంత్రం మాత్రమే చేయాలి. ఖాళీ కడుపుతో ప్రాణాయామం అస్సలు చేయకండి.

అనులోమ విలోమాసనంలో మన నాసిక ఒక్క రంధ్రం నుంచి గట్టిగా శ్వాసను పీలుస్తూ మరో రంధ్రం నుంచి వదిలేయడాన్ని అనులోమ విలోమ పద్ధతి అంటారు.ఇలా ప్రతిరోజు చేయడంతో శ్వాస నాళాల పనితీరు మెరుగుపడటంతో శ్వాసక్రియ వృద్ధి చెందుతుంది. వీరభద్రాసన శ్వాస సంబంధిత వ్యాధులను తొలగించి ఊపిరితులను ఆరోగ్యంగా ఉంచడంలో చక్కగా సహాయపడుతుంది.