Saffron: శీతాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు,జ్వరం వంటి వ్యాధులు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శీతాకాలంలో సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్లలో రూపంలో విజృంభిస్తున్న వేళ అందరికీ వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం.ప్రజలు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కుంకుమపువ్వు వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కుంకుమపువ్వు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ. కుంకుమ పువ్వు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు కుంకుమ పువ్వు కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. గర్భవతిగా ఉన్న స్త్రీలు ప్రతిరోజు కుంకుమపువ్వు పాలలో కలుపుకొని తాగడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
కుంకుమపువ్వు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేద మందుల తయారీలో కూడా కుంకుమపువ్వు విరివిగా వినియోగిస్తారు. కుంకుమ పువ్వు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరించి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. అందువల్ల అధిక బరువు సమస్య తగ్గుముఖం పడుతుంది.
ప్రతిరోజు కుంకుమ పువ్వు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది.చెడు కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బంది పడుతున్న వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగడం వల్ల హాయిగా నిద్ర పట్టి మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది.