ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యన ఉన్న స్నేహం గురించి అందరికి తెలుసు . 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కు కేసీఆర్ పూర్తి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ కేసీఆర్ కోసం ఏ రాజకీయ నాయకుడు చెయ్యని త్యాగం చేసి, కేసీఆర్ పై ఉన్న ప్రేమను జగన్ చాటుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ కోసం జగన్ రెడ్డి వైసీపీ కూడా త్యాగం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.
తెలంగాణలో వైసీపీ ఇప్పట్లో రాదా!!
తెలంగాణలో ఇప్పటి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే ఉన్నాయి. ఈ పార్టీల మధ్యనే పోటీ ఉంది. అయితే ఇప్పటికి తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇంకా అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు జగన్ కు అండగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో కూడా ఇప్పుడు వైసీపీని బలపరచాలని ఇక్కడ ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు జగన్ కు విన్నవించుకున్నారని, ఇప్పట్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అవకాశం లేదని జగన్ ఇక్కడి నాయకులు చెప్పినట్టు రాజకీయ వర్గాల సమాచారం.
కేసీఆర్ మీద ప్రేమ కోసమేనా!!
2019 ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ నేరుగా వెళ్లి, మద్దతు ప్రకటించారు. విధంగా జగన్ కు కేసీఆర్ పై అమితమైన అభిమానం ఏర్పడింది. ఈ ప్రేమ కోసమే ఇప్పుడు జగన్ తెలంగాణలో పార్టీని బలోపేతం చెయ్యడం లేదని, కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణలో వైసీపీని బలోపేతం చెయ్యడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసీఆర్ మీద ఉన్న ప్రేమ కోసం జగన్ ఏకంగా పార్టీనే త్యాగం చేస్తున్నారు. ఈ ప్రేమ ఇంకెన్నాళ్లు ఉంటుందో చెయ్యాలి.