RK Sagar: మొగలిరేకులు సీరియల్ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. హీరో కోసం రంగంలోకి డిప్యూటీ సీఎం, సీఎంలు ఎంట్రీ!

RK Sagar: మొగలిరేకులు సీరియల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్కే నాయుడు. లేదా మున్నా. ఈ రెండు పేర్లతో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు హీరో సాగర్. చాలామంది హీరో సాగర్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ మొగలిరేకులు సీరియల్ హీరో అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒకానొక సమయంలో ప్రసారమైన ఈ సీరియల్ తో భారీగా క్రేజ్ ని సంపాదించుకున్నారు సాగర్. ఈ సీరియల్ తర్వాత చాలామంది అతన్ని మున్నా, ఆర్కే నాయుడు అని పిలిచేవారు. ఒకప్పుడు సీరియల్స్ లో నటించి మెప్పించిన సాగర్ ప్రస్తుతం హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

అయితే అందులో భాగంగానే సాగర్ హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ది 100. ఈ సినిమా జూలై 11న గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఒక పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు హీరో సాగర్. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు మరొక ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టేశారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కాగా హీరో సాగర్ తెలంగాణ జనసేనలో కీలక పదవిలో ఉన్న విషయం తెలిసిందే.

దాంతో ది100 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ గా హాజరు కాబోతున్నారట. రేపు జులై 6న ది100 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓకే ప్రైవేట్ హోటల్ లో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. ఈ ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు సమాచారం. దీంతో సాగర్ సినిమా కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఆశ్చర్యపోతున్నారు. హీరో సాగర్ క్రేజ్ మామూలుగా లేదుగా ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం,తెలంగాణ సీఎంలు రావడం అంటే మామూలు విషయం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు .