తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ లెక్షరర్‌కి ఫోన్ చేసి అభినందించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదాశివయ్య పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సంకల్పించాడు. అంతేకాదు తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి కృషిచేస్తున్నాడు.
అయితే నేడు విద్యాశాఖపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్‌కు అధికారులు లెక్షరర్ సదాశివయ్య గురుంచి చెప్పారు. అయితే కేవలం విద్యాబోధనకు మాత్రమే పరిమితం కాకుండా కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్షరర్లు మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారని అలాంటివారిని ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా అభినంధించాలని అన్నారు.
అనంతరం లెక్షరర్ సదాశివయ్యకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ఆయనను అభినందించారు. మంచి సంకల్పంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని, జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కావలసిన నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందని అన్నారు. వెంటనే వచ్చి ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీనీ, తనను కూడా కలవాల్సిందిగా కోరాడు. మీరు ఇన్ని రోజులు చేస్తున్న కృషికి ప్రభుత్వం నుంచి రివార్డ్ కూడా అందిచబోతున్నట్టు తెలిపింది. అయితే స్వయంగా సీఎంగారే ఫోన్ చేసి అభినందించడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పడం శుభపరిణామమని అన్నారు.