సాగర్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం!

Kcr announced that the government decided to increase wages for the government employees

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కేసీఆర్ ఎవరిని బరిలోకి దింపుతారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఆయన కుటుంబసభ్యులను పోటీ దింపుతారా లేక కొత్త నేతను తెరపైకి తీసుకొస్తారా ? అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే , ఈ రోజు నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

cm kcr entering into the field in ghmc elections
cm 

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో అప్రమత్తమైన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నారు. నోముల నర్సింహయ్య మరణంతో సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు, దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. నాగార్జునసాగర్‌పైనా కన్నేసింది.

మరికాసేపట్లో హెలికాప్టర్‌లో సాగర్ బయలుదేరనున్న కేసీఆర్ తొలుత సాగర్ చేరుకుని అక్కడి డ్యామ్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు హాలియాలో బహిరంగ సభలో మాట్లాడతారు. మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లు చేయించగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పనులను పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కార్యకర్తలు, రైతులను పెద్ద ఎత్తున ఈ సభ కోసం సమీకరిస్తున్నారు.