తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమన్షుకు గాయాలయ్యాయి. ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే హిమన్షును సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాలు జారి కింద పడిన తర్వాత హిమన్షును నడవలేకపోవడం, తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటనే హిమన్షుకు సీటీస్కాన్ చేశారు. తుంటి దగ్గర, మోకాలుకి ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు తెలిపారు. వెంటనే చికిత్స చేసి కట్టు కట్టారు.
బుధవారం హిమన్షును ఆసుపత్రిలో చేర్చించారు. కాగా.. హిమన్షుకు తోడుగా రాత్రి మొత్తం మంత్రి కేటీఆర్, ఆయన భార్య ఆసుపత్రిలోనే కొడుకు దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ఆసుపత్రికి ఫోన్ చేసి చికిత్స గురించి ఆరా తీసినట్టు సమాచారం.