సీఎం కేసీఆర్ ఈ రోజు స్వల్ప అస్వస్థతకు లోనవడంతో ఆయనను యశోద ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గా రావడంతో వైద్యులు ఆయనను కొద్ది గంటల్లోనే డిచ్చార్జ్ చేశారు. ఆయన ప్రస్తుతం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించినట్లు తెలుస్తోంది. నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆయన ఆనారోగ్యం కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది.
కేసీఆర్ డిశ్చార్జ్.. ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం
