తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థత

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.