ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుండి రాజధాని అనే అంశం రాజకీయంగా మారిన విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా ఉంచాలని టీడీపీ నాయకులు ధర్నాలు చేస్తుంటే, కానీ తమ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తుందని వైసీపీ నాయకులు గట్టిగా చెప్తున్నారు. అయితే వైసీపీ నాయకులకు, సీఎం జగన్ కు ఎందుకు అమరావతి అంటే ఇష్టం లేదో ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చెప్పలేదు. అయితే ఇప్పుడు మొన్న జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అమరావతిపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అమరావతిపై జగన్ ఆశక్తికరమైన వ్యాఖ్యలు
అమరావతిని రాజధానిగా కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి పూనుకున్నారు. అయితే అమరావతిని ఎందుకు రాజధానిగా క్యాన్సల్ చేశారో మాత్రం జగన్ ఇప్పటి వరకు చెప్పలేదు, ఇక మీదట కూడా చెప్పడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అప్పుడప్పుడు జగన్ బహిరంగ సభల్లో తన మనసులోని మాటను చెప్తూ ఉంటారు. మొన్న జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అమరావతిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కులమత వర్గ వర్ణాలకు తావు లేని రాజధానిని మనం నిర్మించుకుందామని కాకినాడ సభలో జగన్ పిలుపు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను గమనిస్తే అందులో ఉన్న అంతరార్ధం ఎంతో బోధపడుతుంది.
రాజధానికి కూడా వర్గాల పోరు తప్పదా!!
రాజధాని అంటే ఏమిటి అని ఎవరినైనా అడిగితే ఒక రాష్ట్రానికి ముఖ్య పట్టణం అని చెబుతారు. కానీ జగన్ ని అడిగితే ఆయన ఇలా చెబుతారు. అన్ని వర్గాల ప్రజలు హాయిగా కలసి ఉండేదే అసలైన రాజధాని అని కూడా అంటారు. మరి జగన్ చెప్పిన పద్ధతిలో చూస్తే అమరావతి అందరి రాజధాని అవునా కాదా అన్నదాని మీద ఎవరి మటుకు వారికే సమాధానం దొరుకుతుంది. అమరావతిలో ఒక సామాజికవర్గం వారే పెద్ద ఎత్తున ఉన్నారంటూ వైసీపీ నేతలు తరచుగా చేసే విమర్శలు చూసినా, అక్కడ యాబై వేల మంది ఎస్సీలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వవద్దు అంటూ ఒక సామాజిక వర్గం కోర్టుకు వెళ్ళిన సందర్భాన్ని చూసినా జగన్ ఎందుకు ఈ మాటలు అన్నారో ఇట్టే అర్ధమవుతుంది.