కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. ఓవైపు భారీగా కేసులు..మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. రానున్న రెండు..మూడు నెలల్లో కరోనా మరింత ప్రతాంపం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్కూళ్లలో నాడు-నేడు వ్యవసాయం, తాజా పరిస్థితులపై సమీక్షంచారు. ఈ సందర్భంగా నాడు-నేడు పనులు ఆగస్ట్ 31 వరకూ పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు.
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. కేంద్రం అనుమతులిస్తున్నప్పటికీ రాష్ర్ట ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదు. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ఏపీ విషయానికి వస్తే కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ నిత్యావసర సరుకులు తీసుకోవడానికి అనుమతిస్తున్నారు. రవాణ వ్యవస్థ యధావిధిగా కొనసాగుతున్నప్పటికీ జనాలు ప్రయాణాలు చేయడానికి బెంబేలెత్తిపోతున్నారు. ఆర్టీసీని నష్టాలు భరిస్తూనే తిప్పుతున్నారు. ఈనేపథ్యంలో జగన్ ఏకంగా స్కూల్స్ ఓపెన్ దిశగానే చర్యలు ముమ్మరం చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే కరోనా జిల్లాలు దాటి మండలాలకు పాకేసింది. అక్కడ నుంచి గ్రామలకు జోరుగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో స్కూల్స్ ఓపెన్ చేయడం రిస్క్ అనే తెలుస్తోంది. వందల మంది ఉండే స్కూల్స్ లో భౌతికదూరం, ప్రభుత్వ నిబంధనలు పాటించడం కష్టమే అవుతుంది. ఇంకా నెల రోజులు సమయం ఉంది కాబట్టి ఈలోపు సీఎం నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పటికే జగన్ కరోనాతో కలిసి బ్రతకాల్సిందేనని చాలా బలంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇటు భారత్ బయోటెక్స్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఆగస్ట్ 15 వరకూ అందుబాటులోకి తీసుకొస్తుందని అంటున్నారు.