కులాలు, మతాలు, ప్రాంతాల ప్రస్తావన లేకుండా రాజకీయాల గురించి మాట్లాడటం చాలా కష్టం. ఒకవేళ ప్రజలు వాటికి దూరంగా ఉండలనుకున్నా కూడా రాజకీయ నాయకులే వాటిని బలంగా రుద్దుతుంటారు. అలాగే ఇప్పుడు వైసీపీ నాయకులు గత కొంత కాలంగా కులాలను, మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. అలాగే అవసరమైతే తమ ప్రత్యర్థులను, కొన్నిసార్లు సొంత పార్టీ వారిని కులాలు, మతాల పేర్లు పెట్టి దూషిస్తున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వెయ్యాలని, దీని వల్ల రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం జరగనుందని భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక ఎంపీకి క్లాస్ పీకారు. అతను ఎవరంటే ఎంపీ గోరంట్ల మాధవ్.
మాధవ్ కు క్లాస్ పీకిన జగన్
అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలోనే కులాలను టార్గెట్ చేశారు. కులాల పేర్లు ఎత్తి విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా రెడ్లు, కమ్మలు దౌర్జన్యాలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక జారీ చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ పెద్దలు మాధవ్ కు క్లాస్ పీకారు. ఇక నుండి ప్రత్యర్థులను సైతం కులాలు, మతాల పేరిట దూషించారదని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ప్రత్యర్థుల పేర్లను చెప్పి ఎలాగైనా తిట్టండి, ఏమైనా చేసుకోండి కానీ కులాల, మతాల ప్రస్తావన మాత్రం తీసుకొని రావద్దని మాధవ్ ను పార్టీ పెద్దలు హెచ్చరించారు.
కులాల దూషణకు వైసీపీ నాయకులు దూరమా!!
గత కొంత కాలం నుండి వైసీపీ నాయకులు కులాలు, మతాల పేరిట రాష్ట్రంలో హడావిడి చేస్తున్నారు. వైసీపీలోని నేతలే ఒకరిపై ఒకరు కుల దూషణలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.అయితే ఇలా చెయ్యడం వల్ల ఓటు బ్యాంక్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన వైసీపీ పెద్దలు కులాల, మతాల ప్రస్తావనకు దూరంగా ఉంటూ ప్రతిపక్షంలో ఉన్న నాయకులను, వాళ్ళు చేసిన తప్పులపై టార్గెట్ చెయ్యాలని సూచనలు జారీ చేసింది.