జగన్ మైండ్ గేమ్..షాక్ లో ప్రతిపక్షాలు

Cm Jagan Telugu Rajyam

  పరిపాలన పరంగా పెద్దగా అనుభవం లేని జగన్ ను ఇబ్బందులు పెట్టటానికి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు వేయని ఎత్తులు లేవు, అయితే వాటిని జగన్ కొంచం ఆలస్యంగానైనా సరే తిప్పికొట్టటంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా సీఎం జగన్ ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించాలని విపక్షాలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్వేది లో రధం దగ్ధం కావటంతో వెతకపోయిన తీగ కాలికే తగిలినట్లు అయ్యింది. దీనితో బీజేపీ టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి.

Cm Jagan Telugu Rajyam

 

  ఒక దశలో వైసీపీ నాయకత్వానికి అంతర్వేది విషయంలో కంగారు కూడా మొదలైంది. ప్రభుత్వం మెడకు ఉచ్చులాగా బిగుసుకునే అవకాశం ఉందని భావించారు. ఈ విషయంలో ఏమి మాట్లాడాలో, దానిని ఎలా పరిష్కరించాలో తెలియక తికమక పడ్డారు. మరోపక్క తిరుమల తిరుపతి డిక్లరేషన్ విషయంలో కూడా హిందూ సంఘాలు జగన్ ని టార్గెట్ చేశాయి. ఇవన్నీ జరుగుతున్నా కానీ జగన్ ఎప్పుడు నోరువిప్పి వీటిపై స్పదించలేదు. దీనితో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయి విమర్శలు చేశాయి . అయితే వాటికీ జగన్ సైలెంట్ గా చెక్ పెట్టటం ఇక్కడ విశేషం. అంతర్వేది రధం కాలిపోవడంతో దాని స్థానంలో 95 లక్షలు ఖర్చుపెట్టి 7 అంతస్తుల కొత్త రధాన్ని ప్రభుత్వమే చేపిస్తుంది . అదే సమయంలో ఆ కేసును సిబిఐ కి ఇవ్వటం జరిగింది. హిందూ దేవాలయాల మీద కావచ్చు, దేవాలయాల ఆస్తుల మీద కావచ్చు ఎవరైనా దాడులు చేసినట్లు రుజువైతే కఠిన శిక్షలు వుంటాయని హెచ్చరించింది. ఇక తిరుమల డిక్లరేషన్ విషయంలో రాద్ధాంతం చేస్తున్న ప్రతిప్రక్షాలకు నామం , పంచెకట్టుతో జగన్ నోరు మూయించిన విధానం అద్భుతం.

  వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చే సమయంలో సీఎం జగన్ అచ్చమైన హిందూ సాంప్రదాయ పద్దతిలో వెళ్లటంతో టీడీపీకి బీజేపీకి నోట మాట రాలేదు. మూడు నామాలు పెట్టుకొని పంచె కట్టుకొని జగన్ కనిపించటంతో ఇక మాట్లాడటానికి ఏమి లేకుండా పోయింది ప్రతిపక్షాలకు, ఈ రకంగా తిరుమల విషయంలో సీఎం జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోని ప్రభుత్వంపై ఎలాంటి మచ్చ పడకుండా వ్యవహరించటంతో వైసీపీ శ్రేణులు చాలా సంతోషంగా ఉన్నారు. పరిపాలన విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో కావచ్చు జగన్ ను ఇరుకున పెట్టటానికి విపక్షాలకు తలకు మించిన భారం అవుతుంది. ఎంతో కష్టపడి ఉచ్చు బిగిస్తే సీఎం జగన్ చాలా తెలివి వాటినుండి బయటపడటంతో ప్రతిపక్షాలకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ఎంతైనా సీఎం జగన్ తండ్రికి తగ్గ తనయుడు కదా..