నాలుగు నెలలుగా అంతా కరోనా మయమైపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడం, చికిత్స తదితర పనుల్లో బిజీ అయింది. ఇలాంటి కష్ట కాలాన్ని సైతం లెక్క చేయకుండా, ఆర్ధిక ఇబ్బందులున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం బ్రేకులు వేయలేదు. కరోనా తో పని లేకుండా దానికి సంబంధించి పర్యవేక్షణ చేస్తూనే మిగతా సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం త్వరిగతిన కదిలింది. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఆక్షంలన్నీ తొలగిపోతున్న నేపథ్యంలో సీఎం జగన్ సొంత జిల్లా కడప పర్యటనకు రెడీ అవుతున్నారు. జులై 7, 8 తేదీల్లో కడపకు వెళ్లనున్నారు.
వివిధ అభివృద్ధి పనులకు సీఎం స్వయంగా శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి కడప జిల్లా ఇన్ చారర్జి ఆదిమూలపు సురేష్ సీఎం పర్యటన వివరాలను వెల్లడించారు. పులివెందలలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అభివృద్ది పనులను శుక్రవారం మంత్రి సురేస్, అవినాష్ రెడ్డి పరిశీలించారు. అలాగే వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అలాగే 7, 8 తేదీల్లోనూ సీఎం ఇడుపుల పాయలో పర్యటించి అభివృద్ది పనులకు శంకుస్థాప చేయనున్నట్లు మంతి తెలిపారు.
రాష్ర్టంలోని ట్రిపుల్ ఐటీలను అధునాతనంగా జగన్ తీర్చి దిద్దుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ఉత్తమమైన ఇంజనీరింగ్ విద్యను అందించడం వైఎస్సార్ వల్లే సాధ్యమైందని, ఇప్పుడు జగన్ మరింత మెరుగులు దిశగా చర్యలు తీసుకుంటు న్నారని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి మరిన్ని మంచి విద్యా కార్యక్రమాలు దిశగా అడుగులు వేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ సంక్షేమాలను అమలు పరచడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని గుర్తు చేసారు మంత్రి.