ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనకు మంచి జరగకపోవచ్చు కానీ.. వేరే వాళ్లకు మంచి జరగొచ్చు. నిర్ణయం తీసుకున్న వాళ్లు ఎవ్వరైనా సరే.. చివరకు ముఖ్యమంత్రి అయినా సరే.. ఎందుకంటే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణకు ఆదాయం పెరిగిపోతోంది.
నిజానికి ఆయన ఏపీకి ఆదాయం పెరగడం కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. రివర్స్ లో ఏపీకి కాకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదాయం పెరిగింది.
షాకింగ్ గా ఉంది కదా.. ఇంతకీ ఏంటి సంగతి అంటే.. సీఎం జగన్ ఏం చేశారంటే.. కరోనా వైరస్ వల్ల ఏపీకి విపరీతంగా ఆదాయం తగ్గింది కదా. రాష్ట్రానికి కాస్త ఆదాయం పెంచాలనుకున్నారు. ఓవైపు ప్రభుత్వ పథకాల కోసం డబ్బు కావాలి కదా. అందుకే.. సెప్టెంబర్ లో పెట్రోల్, డీజిల్ ను లీటర్ కు 1 రూపాయి సెస్ ను పెంచారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కాబట్టి.. ఒక రూపాయి సెస్ ను పెంచేశారు.
దీని వల్ల రాష్ట్రానికి కోట్లలో ఆదాయం వస్తుంది కదా అని అనుకున్నారు. ఒక రూపాయి సెస్ పెంచడం వల్ల.. పక్కనే ఉన్న తెలంగాణతో పోల్చితే.. పెట్రోల్ లీటరుకు మూడు రూపాయలు, డీజిల్ లీటరుకు 2.70 రూపాయలు పెరిగింది. ఓ పది లీటర్లు పెట్రోల్ పోయించుకోవాలంటే.. వేరే రాష్ట్రం కన్నా 30 రూపాయలు ఎక్కువివ్వాలి. దీంతో కొందరు వాహనదారులు ఏం చేస్తున్నారంటే.. సరిహద్దుకు సమీపంలో ఉన్న తెలంగాణ పెట్రోల్ బంకుల్లోకి వెళ్లి పెట్రోల్ ను కొనుక్కుంటున్నారట. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలనుకున్నా… అటువైపు వెళ్లాలనుకున్నా.. వాహనదారులు వేరే రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకుంటుండటంతో.. ఏపీ ఆదాయానికి గండి పడినట్టు అయింది. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది ఏపీ ప్రభుత్వం తీరు. పోయి పోయి తెలంగాణకు లాభం చేకురేటువంటి నిర్ణయాలను సీఎం జగన్ తీసుకున్నారు అంటూ ఏపీ ప్రజలు అంటున్నారు