తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి నోటి దూసుకు గురించి అందరికి తెలిసిందే. ఆ నోటి దురుసు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు చెల్లింది కానీ, ప్రతిపక్షములో ఉన్నప్పుడు చెల్లటం లేదు. ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వడ్డీతో సహా కలిపి తిగిరి ఇస్తుంది. దీనితో గత కొద్దీ కాలంగా కొంచం నోటి దురుసు తగ్గించుకున్నాడు జేసీ.
నిన్నటి రోజున తాడిపత్రిలోని గనులు, భూగర్భ కార్యాలయానికి వచ్చి, తన భార్య పేరు మీదున్న గనులకు అనుమతులు ఇవ్వటం లేదని, ఇలా చేస్తే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని చెప్పటమే కాకుండా, నాకు మీరు ఏమైనా “సన్మానం” చేస్తే, ఆ తర్వాత అందరిని గుర్తుపెట్టుకొని మరి, నేను ఇంతకంటే ఎక్కువగానే ‘సన్మానం” చేస్తానంటూ అధికారులకు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ వ్యాఖ్యలు నిన్న ప్రభుత్వ వర్గాల్లో అలజడి సృష్టించాయి. తాజాగా దానికి తగ్గ ప్రతిఫలం జేసీ అనుభవిస్తున్నాడు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను గాలికొదిలేశారని, మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరగడం లేదన్న అధికారులు, నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో జేసీ దివాకర్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది.
నిన్న ఏమో తన గనులకు అనుమతులు ఇవ్వలేదని హడావిడి చేసాడు. నేడు ఏకంగా ఆ గనులను మూసేయాలి అనే విధంగా ప్రభుత్వ నోటీసులు ఇవ్వటంతో ఏమి చేస్తాడో చూడాలి. గతంలో జేసీ సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు దొంగ బస్సుల కేసు లో కొన్ని రోజులు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే రూల్స్ కి వ్యతిరేకంగా ఊరేగింపు చేయటమే కాకుండా నోటి దురుసుతో అక్కడి అధికారులను దూషించాడు. ఇంకేముంది వచ్చిన కొద్దీ గంటల్లోనే మళ్ళీ జైలుకు వెళ్ళిపోయాడు. ముఖ్య విషయం ఏమిటంటే అక్కడ అధికారంలో ఉంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి, లేకపోతే ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. చర్య కు ప్రతిచర్య చాలా వేగంగా వస్తుందనే విషయం మర్చిపోకూడదు .