Home News సీఎం జగన్ తిరుపతి టూర్ రద్దు.. ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చేసినట్లే..

సీఎం జగన్ తిరుపతి టూర్ రద్దు.. ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చేసినట్లే..

Cm Jagan Cancels Tirupathi Tour, But.. Why

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు. ముందస్తుగా నిర్ణయించుకున్నదాన్ని బట్టి ఈ నెల 14న సీఎం జగన్, తిరుపతిలో పర్యటించి, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా బహిరంగ సభ నిర్వహించాల్సి వుంది. అయితే, చిత్తూరు సహా నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో, ప్రజారోగ్యం దృష్ట్యా తాను తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్లు తిరుపతి ప్రజల్ని ఉద్దేశించి లేఖ రాశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నిజానికి ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించి తీరాల్సిందే. కరోనా నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఇలాంటి ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అయితే, ఆ ప్రతిపాదనకు అక్కడి రాజకీయ పక్షాలేవీ సానుకూలంగా స్పందించలేదు.

తిరుపతి విషయానికొస్తే, వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నిత్యం వందలాది, వేలాదిమందిని వెంటేసుకుని వైసీపీ నేతలు, ఊరూ వాడా ప్రచారం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆ మాటకొస్తే, చిత్తూరు జిల్లాకి చెందిన పలువురు వైసీపీ నేతల మీద కరోనా సూపర్ స్ప్రెడర్స్.. అంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.. వ్యవహారం కోర్టులదాకా వెళ్ళింది. కరోనా నేపథ్యంలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సబబే అయినాగానీ, తిరుపతి బహిరంగ సభ ఆయన నిర్వహించి వుంటేనే బావుండేది. పెద్దగా జనం హాజరు కాకుండా చర్యలు తీసుకుని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తన సందేశాన్ని, ఆ బహిరంగ సభ ద్వారా.. లైవ్ టెలికాస్ట్ రూపంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు చేరేలా వ్యూహం రచించి వుండాల్సింది. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైఎస్ జగన్, కరోనా అనే కుంటి సాకు చూపిస్తున్నారనే విమర్శలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు ఆస్కారమిచ్చినట్టో.?

Related Posts

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

జనసేన కొంప ముంచనున్న విశాఖ స్టీల్ ప్లాంట్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖ స్టీలు ప్లాంటుని సందర్శించబోతున్నారట అతి త్వరలో. ఈ విషయాన్ని ఇటీవలే జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన విశాఖ వెళ్ళారు, స్టీలు...

Related Posts

Latest News