తనకు మార్గదర్శి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ప్రజలకు ఆయన చేసిన సేవలను నేను అందించగలిగితే నా జన్మ ధన్యమైనట్లే అంటూ అనేక సందర్భాల్లో చెప్పిన సీఎం జగన్, నేడు తన తండ్రి కంటే ఎక్కువగానే ప్రజా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ప్రజల చేత మన్ననలు అందుకుంటున్నాడు, అదే సమయంలో మరోపక్క తన ప్రత్యర్థుల విషయంలో ఎలాంటి మొహమాటలలకు తావు లేకుండా తప్పుచేశారని తెలిస్తే చాలు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదంటూ జగన్ కొరడా రులిపిస్తున్నాడు, ఇవన్నీ కక్ష సాధింపు చర్యలని ప్రతిపక్షాలు గోల చేస్తున్న కానీ, వాటిని లక్ష్య పెట్టకుండా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు వెళ్తున్నాడు.
ప్రజా వేదిక కూల్చివేయటం కావచ్చు, మాజీ సీఎం ఉంటున్న ఇంటికే నోటీసులు ఇవ్వటం, రాజధానిని మార్చటం, అచ్చెన్న నాయుడు ను అరెస్ట్ చేయటం, గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలను కూల్చివేయటం లాంటివి జగన్ మోహన్ రెడ్డి యొక్క ధైర్యానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటనలో నియమ నిబంధనలను ఉల్లఘించారు కాబట్టే వాళ్లపై కావచ్చు, ఆయా సంస్థలపై కావచ్చు చర్యలు తీసుకున్నాడు సీఎం జగన్,. ఇలాంటి విషయాల్లో వైఎస్ కి జగన్ కు చాలా తేడా ఉంది , ఉదాహరణకు గీతం వ్యవహారమే తీసుకుంటే, ఈ క్రమబద్దీకరణ ఫైల్, 40 ఎకరాల కబ్జా విషయం వైఎస్ హయాంలో కూడా ఉంది , కానీ ఎప్పుడు కూడా వైఎస్ దాని జోలికి వెళ్ళలేదు. కేవలం అది ఒక్కటే కాదు, తన రాజకీయ ప్రత్యుర్థుల విషయంలో చూసీచూడనట్లు వెళ్ళిపోతూ, రాజకీయంలో కొన్ని సర్దుబాట్లు తప్పనిసరి అంటూ రాజశేఖర్ రెడ్డి నమ్మేవాడు.
కానీ జగన్ తీరు మాత్రం వేరు, 40 ఎకరాల విషయంలో గీతం యజమాన్యందే తప్పు అని తెలియటంతో వెంటనే అక్రమ కట్టడాలను కూల్చి వేయించాడంటే ఏమిటా.. గుండె దైర్యం..? రాజకీయంగా సరిగ్గా చూసుకుంటే కేవలం పదేళ్ల అనుభవం మాత్రమే అతని సొంతం, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే అంత సత్తా కూడా లేదు, జగన్ మాట సరిగ్గా వినే నేత దేశం మొత్తం మీద ఎవరు లేరు, రేపొద్దున్న ఏమైనా జరిగితే జగన్ ను కాపాడటానికి వచ్చేవారంటూ ఎవరు కనిపించటం లేదు, అయినా జగన్ అరాచక శక్తులను ఢీ కొడుతూ ముందుకు వెళ్తున్నదంటే దానికి కారణం ప్రజాబలం, ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం, తాను చేసే పనుల్లో నిజాయితీ ఉందని ప్రగాఢ విశ్వాసమే జగన్ లో ఆ ధైర్యానికి కారణమని చెప్పుకోవాలి. ఈ విషయంలో జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మించి పోయాడనే చెప్పాలి