2024 ఎన్నికల సమయానికల్లా! రాష్ర్టంలో వైకాపా జెండా తప్ప పసుపు జెండా కనబడటానికి వీలు లేకుండా వైకాపా అదిష్టానం పావులు కదుపుతోంది. వరుసగా టీడీపీ సీనియర్ నేతల అరెస్ట్ ల పర్వమే అందుకు పెద్ద సూచిక. అవినీతి, అక్రమాల కేసుల్లో అడ్డంగా దొరికిపోయి ఒక్కొక్కొరు జైళ్లకు వెళ్తోన్న విధానం చూస్తుంటే జగన్ సర్కార్ ఏ రేంజ్ లో ప్లాన్ చేసి దెబ్బ కొడుతుందో తెలుస్తోంది. కుంభ కోణాలకు పాల్పడ్డారు కాబట్టి పచ్చబ్యాచ్ కి కటకటాలు తప్పడం లేదు. వచ్చే ఎన్నికల సమయానికల్లా కీలక నేతలంతా అరెస్ట్ అయి జైలులో ఉంటటం ఖాయమని ఇప్పటికే ఓ వర్గం మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ బాబు సహా అందరి లెక్క సరిచేసే ఆయుద్ధాలు సిద్దం చేసుకుని పక్కా ప్లానింగ్ తో ప్రభుత్వం ముందుకు కదులుతోందని అంటున్నారు.
ఇక జగన్ వైకాపా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యే వరకూ పార్టీకి కొన్ని కఠినమైన నియమ నిబంధలను పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీలో చేర్చుకోవాలంటే ఆ వ్యక్తులు కూడా పార్టీని, ప్రజల్ని ప్రేమించే వారై ఉండాలని..ఇతర పార్టీల నుంచి వచ్చే వారు, ఒకవేళ గెలిస్తే ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి, ఎలాంటి పదవి లేకుండా ఓ కార్యకర్తలా పార్టీలోకి రావాలి తప్ప! పదవులు అడ్డుపెట్టుకుని పార్టీలోకి వచ్చే నాయకులు, నేతలు అవసరం లేదని ఎన్నికలు ముదే కరాఖండీగా చెప్పేసారు. ఇక గతేడాది జరిగిన ఎన్నికల ఫలితాల్ని బట్టి వైకాపా జనాల్లో ఎంత బలమైన పార్టీగా ఆవిర్భవించిందో తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న రాజకీయ పరిస్థితుల గురించి తెలిసిందే. టీడీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు వైకాపా కండువా కప్పుకోవాడనికి రెడీ అవుతున్నారు. విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు కూడా రెడీగా ఉన్నారు. ఈనెల 15న పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇలా అన్ని జిల్లాల్లో కీలక నేతల్ని వైకాపా ఆకర్షిస్తోంది. మరి ప్రతిపక్ష పార్టీ అధినేత అయిన చంద్రబాబు సొంత జిల్లా, అందులోనూ కుప్పం నియోజక వర్గం పరిస్థితి ఏంటి? అంటే అక్కడా జగన్ పడగొట్టి తొడగొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. కుప్పంలో గడపగడపకి జగన్ సంక్షేమ ఫలాలు అందాయా? లేదా? అన్నదానిపై స్థానిక నేతలు ఎప్పటికప్పుడు ఆరా తీసి పార్టీతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
అటు మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా ఆకర్ష్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బీసీలు అధికంగా ఉన్న కుప్పంలో 150 నాయి బ్రాహ్మణ కుటుంబాలు, సుమారు 150 ముస్లీమ్ కుటుంబాలు ఇటీవల వైకాపా లో చేరడంతో టీడీపీకి గట్టి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ నియోజక వర్గంలో కీలకంగా ఉన్న టీడీపీ నేతల్ని ప్యాన్ కిందకు చేర్చేలా వైకాపా ఫిరాయింపులకు పాల్పడు తోందిట. 30 ఏళ్ల నాటి సీనియర్ నేతలంతా గంపగుత్తుగా ప్యాన్ కిందకు రావడానికి రెడీ అవుతున్నారుట. ఈ శుభ సూచికలు అన్ని వైకాపాకి వరంగా…టీడీపీకి శాపంగా వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.