Chandra Babu: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఊహించని విధంగా తన రాజకీయాలకు గుడ్ బై చెబుతూ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన ఊహించని విధంగా రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఈ విషయం కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. విజయ్ సాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు ఆయన పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్నటువంటి విజయ్ సాయి రెడ్డి ఇలా రాజీనామా చేయడం వెనుక కారణం ఏంటనే చర్చలు జరుగుతున్నాయి.
పార్టీలో విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదని చెవిరెడ్డి, సజ్జల, సుబ్బా రెడ్డి వంటి వారికి ప్రాధాన్యత ఇవ్వటం వల్లే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారనే వాదన కూడా వచ్చింది. కానీ ఈయన మాత్రం తాను తన వ్యక్తిగత కారణాలవల్ల మాత్రమే బయటకు వచ్చానని చెప్పుకు వచ్చారు. ఇక విజయ్ సాయి రెడ్డి రాజీనామా వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని మరికొందరు భావిస్తున్నారు.
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక గల కారణం ఏంటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… విజయసాయి రాజీనామా వైసీపీలో అంతర్గత వ్యవహారం అన్నారు. వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీ నేతలకే తెలుస్తోంది. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారు. నాయకుడిపై నమ్మకం ఉంటేనే నాయకులూ కూడా పార్టీలో ఉంటారు. లేదంటే బయటకు వస్తుంటారు.నమ్మకం లేకపోతే.. ఎవరి మార్గం వాళ్ళు చూసుకుంటారని అన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించారు.
ఇలా విజయసాయిరెడ్డి రాజీనామా విషయం చక చక జరిగిపోగా ఈయన రాజీనామా గురించి మాత్రం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలలోనూ అలాగే వైకాపా నేతలలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి విజయ సాయి రెడ్డి రాజీనామా వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.