AP: జగన్ వల్లే పోలవరం ఆలస్యం అవుతుంది… పుష్కరాలకు పోలవరం పూర్తి: చంద్రబాబు

AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం మనకు తెలిసిందే. ఈ పోలవరం సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.

అనంతరం పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వారికి భరోసా ఇచ్చారు..వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్‌ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు. నిన్నమొన్నటి వరకూ నిర్వాసితులను పట్టించుకున్న వారు లేరు వీలైనంత తొందరగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని తెలిపారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏకంగా ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తామని తెలిపారు. నిజానికి పోలవరం ప్రాజెక్టు ఈపాటికి పూర్తి కావాల్సి ఉన్నది కానీ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఆలస్యం అవుతుందని ఆయన పోలవరం కోసం ఇచ్చిన నిధులు అన్నింటిని కూడా ఇతర పథకాలకు మళ్లించడం వల్ల పోలవరం పూర్తి కాలేదని తెలిపారు.

పోలవరం నిర్వాసితుల కోసం రూ. .829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత మా ప్రభుత్వానిది. పోలవరంలో నీళ్లు వదిలే ముందే.. 2027 నవంబర్‌ నాటికి పునరావాసం పూర్తిచేస్తాం. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇక పోలవరం ప్రాజెక్టు 2027 వ సంవత్సరంలో వచ్చే గోదావరి పుష్కరాల సమయానికి పూర్తి అవుతుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.