Tirumala: తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది గత ప్రభుత్వ హయామంలో తిరుపతి లడ్డు తయారీ కోసం జంతువుల అవశేషాలతో తయారుచేసిన నూనె ఉపయోగించారు అంటూ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసాయి. నిజా నిజాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త తీవ్రదుమారపు రేపింది . ఈ క్రమంలోనే కోర్టు సైతం సీట్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ విచారణలో భాగంగా ఎన్నో కీలక విషయాలను గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే దీంతో మరోసారి లడ్డు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇలా తిరుపతి లడ్డు గురించి తాజాగా వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ..
తిరుపతి లడ్డు తయారీకి జంతువుల అవశేషాలతో తయారు చేస్తున్న నూనె ఉపయోగించారు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన మెడకే చుట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబును బయట పడేయటం కోసం కొన్ని పత్రికలు నానా తంటాలు పడుతున్నాయని అంబటి రాంబాబు తెలిపారు.
లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఆధారాలే లేవన్న అంబటి, టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లు కొండపైకి చేరే అవకాశమే లేనప్పుడు లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు చెప్పినట్టు కల్తీ జరిగే అవకాశమే లేదని తెలిపారు. తన స్వార్థపూరిత రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామి పైనే నిందలు వేస్తున్న ఈయన తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ అంబంటి చంద్రబాబుపై చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.