త‌న ప్రేమ‌, పెళ్ళి విష‌యంపై నోరు విప్పిన హీరో.. అన్నీ కుదిరితే ఈ ఏడాదే పెళ్ల‌ట‌..!

గ‌త ఏడాది సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మందే పెళ్లి పీట‌లెక్కారు. తెలుగులోనే కాక త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన నటీనటులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు, సింగ‌ర్స్, ర‌చ‌యిత‌లు ఇలా చాలా మంది మెచ్చిన అమ్మాయిని మ‌నువాడారు. ఇక 2021లోను చాలా పెళ్లిళ్ళు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. గ‌త ఏడాది క‌రోనా వ‌ల‌న చాలా పెళ్లిళ్లు వాయిదా ప‌డ‌గా, ఈ ఏడాది వారంద‌రు మంచి ముహూర్తం చేసుకొని ఏడ‌డుగులు వేసేందుకు సిద్ద‌ప‌డుతున్నారు.

సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఈ రోజు రామ్ వీర‌ప‌నేనితో క‌లిసి ఏడ‌డుగులు వేయ‌నుంది. ఇక రీసెంట్‌గా ఈ రోజుల్లో హీరోయిన్ ఆనంది కోడైరెక్ట‌ర్‌ను మ‌నువాడింది. ఇక బాలీవుడ్ చాక్లెట్ భాయ్ ర‌ణ్‌బీర్ క‌పూర్ త్వ‌ర‌లోనే అలియా భ‌ట్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. ఇన్నాళ్లు త‌మ ప్రేమ విష‌యాన్ని దాచిన ర‌ణ్‌బీర్ రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పేశాడు. ఇక ఇప్పుడు మ‌రో బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ త‌న పెళ్లిపై నోరు విప్పాడు. కొన్నాళ్లుగా త‌న ప్రేయ‌సి నటాషా దలాల్‌తో ప్రేమ‌లో మునిగి తేలుతున్న వ‌రుణ్ ప‌రిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాదే పెళ్లి అంటున్నాడు.

గ‌త కోద్ది రోజులుగా వ‌రుణ్ పెళ్ళికి సంబంధించి అనేక పుకార్లు షికారు చేస్తున్న నేప‌థ్యంలో స్పందించిన వ‌రుణ్ ధావ‌న్ ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా గంద‌ర‌గోళంగా ఉంది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక‌, కాలం కలిసొస్తే ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చారు. వ‌రుణ్ సినిమా హీరో అయిన‌ప్ప‌టికీ న‌టాషాను ప్రేమ‌ను పొందడానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. త‌ను తాజాగా న‌టించిన కూలీ నెం1 చిత్రంలో సారా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో అంత కన్నా ఎక్కువ క‌ష్టాన్ని న‌టాషా కోసం ప‌డ్డాడ‌ని తెలుస్తుంది.