వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచింది. తమిళ సూపర్ హిట్ సినిమా ‘తెరి’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించగా, ఒరిజినల్ డైరెక్టర్ అట్లీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. జాకీ ష్రాఫ్ విలన్‌గా కనిపించిన ఈ చిత్రానికి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినప్పటికీ, అది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోలేకపోయింది.
ఈ చిత్రం కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఆమెపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర ప్రమోషన్స్‌లో కూడా కీర్తి గ్లామర్ అవతారంతో సందడి చేసింది. కానీ సినిమా విడుదల తర్వాత వచ్చిన మిక్స్డ్ రివ్యూలు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించలేకపోయాయి. మొదటి రోజు కేవలం రూ. 11 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండో రోజు కలెక్షన్స్ రూ. 4 కోట్లకు పడిపోయాయి.
సినిమాకు 75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండగా, ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూసుకుంటే 50 శాతం వసూళ్లు కూడా సాధించే అవకాశం కనిపించడం లేదని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు కథ అర్థం కాలేదని, ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా లేకపోవడం వల్ల సినిమా డిజాస్టర్‌గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించినా సినిమాను రక్షించలేకపోయింది. వరుణ్ ధావన్ యాక్టింగ్‌లో కష్టపడినా, కథన పరంగా అది ఏ మాత్రం కనెక్ట్ కాలేకపోయింది. ఇప్పటివరకు వచ్చిన బాలీవుడ్ డిజాస్టర్లలో ‘బేబీ జాన్’ కూడా చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా ఫలితంతో కీర్తి సురేష్ బాలీవుడ్ ప్రయాణం కాస్త సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.