ఐపీఎల్ చ‌రిత్ర‌లో క్రిస్ మోరిస్ కొత్త రికార్డు .. అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు .. ఎన్ని కోట్లంటే ?

సౌత్‌ఆఫ్రికా బౌలర్ క్రిస్ మోరిస్ ఏకంగా రూ.16.25 కోట్ల ధర పలికాడు. ఈ స్థాయిలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ ధర ఐపీఎల్ వేలం చరిత్రలోనే ధర పలకలేదు. కేవలం రూ.75 లక్షల బేస్ ధరతో వేలంలో నిలిచిన క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మోరిస్ కోసం అటు బెంగళూరు, ముంబై, రాజస్థాన్ ఫ్రాంచైజీలు పోటాపోటాగా వేలం పాడాయి.

కానీ, చివరకు రాజస్థాన్ అతడిని దక్కించుకుంది. ఇక గతేడాది మోరిస్‌ను రూ.10 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు ఈ ఏడాది విడిచిపెట్టేసింది. అయితే మళ్లీ అతడిని దక్కించుకునేందుక ప్రయత్నించింది. కానీ రాజస్థాన్ అత్యధిక ధర చెల్లించి అతడిని చేజిక్కించుకుంది.

ఇక అందరూ ఊహించినట్టే మ్యాక్స్ ‌వెల్‌ కోసం తీవ్ర పోటీ జరిగింది. మ్యాక్స్‌వెల్‌ కోసం ఆర్సీబీ కడవరకూ పోటీలో నిలిచి సొంతం చేసుకుంది. అతని కోసం భారీ మొత్తం చెల్లించింది ఆర్సీబీ. 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయడానికి సీఎస్‌కే-ఆర్సీబీల మధ్య తీవ్ర పోటీ నడిచింది. గతంలో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడగా అతన్ని ఈ సీజన్‌లో వదిలేసుకుంది.తీవ్రంగా నిరాశపరిచన కారణంగా మ్యాక్సీని పంజాబ్‌ విడుదల చేసింది. దాంతో వేలంలోకి వచ్చిన మ్యాక్సీ మరొకసారి జాక్‌పాట్‌ కొట్టాడు.