God Father : స్వాతంత్ర దినోత్సవ కానుకగా చిరు గాడ్ ఫాదర్…!

God Father : చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు లో స్వాతంత్ర దినోత్సవ వారం లో విడుదల చేయాలని చిత్రం సిబ్బంది భావిస్తున్నారు. ఈ సినిమాలో చిరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు.

చిరంజీవి కి జంటగా నయనతార ఈ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తుది షెడ్యూల్ ను హైదరాబాద్ లో నిన్నటి నుండి జరుపుకుంటోంది.మోహన్ raj దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాను ఆగష్టు 11 లేదా 12 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక చిరంజీవి తన తదుపరి చిత్రాలను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆచార్య షూటింగ్ లో చిరు పాల్గొంటున్నారు. ఆచార్య సినిమా కొరటాల దర్శకత్వంలో రూపొందుతోంది.గాడ్ ఫాదర్ విడుదలైన నాలుగు నెలల తేడాతో ఆచార్య సినిమాను విడుదల చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. వరుస సినిమాలతో చిరు జోరు పెంచి ఫ్యాన్స్ కు దిల్ ఖుష్ చేస్తున్నారు.