మెగాస్టార్ “గాడ్ ఫాదర్” తో బాలయ్యని అందుకోలేకపోయారా.?

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లు కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ కూడా తమ సినిమాలతో బిజీగా ఉండగా ఇప్పుడు వాటి తాలూకా లుక్స్ కూడా బయటకి వచ్చేసాయి.

మరి రెండింటికీ కూడా సాలిడ్ రెస్పాన్స్ వస్తుండగా ఆటోమేటిక్ గా పోల్చి చూడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మెగాస్టార్ గాడ్ ఫాదర్ మరియు బాలయ్య నటిస్తున్న భారీ ఏక్షన్ చిత్రం 107వ సినిమా ల తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కోసం చర్చ నడుస్తోంది. అయితే వీటిలో ఎవరి శైలికి తగ్గట్టుగా వారి శైలి లో అదరగొట్టగా..

ఒకింత మాత్రం మాస్ పరంగా చూస్తే బాలయ్యే చిరుని డామినేట్ చేసాడని బాలయ్య అభిమానులు మూవీ లవర్స్ అంటున్నారు. చిరు కూడా మాస్ గానే ఉన్నారు కానీ బాలయ్య తో పోలిస్తే గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ అయితే తేలిపోయింది అని ఎక్కువ టాక్ వినిపిస్తోంది. మరి సినిమాలు రిలీజ్ అయ్యాక ఎలా ఉంటాయో చూడాలి.

ఇక మెగాస్టార్ సినిమా అయితే చెప్పినట్లు గానే విజయదశమి రిలీజ్ కి అనౌన్స్ చేయగా బాలయ్య సినిమా అయితే వచ్చే డిసెంబర్ లో రిలీజ్ అవ్వొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా రెండు సినిమాలకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే బాలయ్య సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా గాడ్ ఫాదర్ ని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.