కరోనా వైరస్ గురించి భయంకర నిజం వెలుగులోకి.. కరోనా వైరస్ ను చైనా ల్యాబ్ లోనే తయారు చేశారట..!

China virologist alleges that corona virus made in lab

అందరూ భయపడుతున్నట్టుగానే కరోనాకు సంబంధించి అసలు నిజయం బయటపడింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా అల్లకల్లోలం చేసిందో అందరికీ తెలిసిందే. అది ఏదో పుట్టిన వైరస్ కదా.. ఏం చేస్తాం.. అంతా దేవుడి మాయ అని అందరం అనుకున్నాం. కానీ.. ప్రపంచాన్ని నాశనం చేసిన కరోనా వైరస్ పుట్టింది కాదు.. తయారు చేసిందట. షాకింగ్ గా ఉంది కదా..

China virologist alleges that corona virus made in lab
China virologist alleges that corona virus made in lab

అవును.. కరోనా వైరస్ పుట్టింది కాదు.. తయారు చేసింది. దాన్ని ల్యాబ్ లో తయారు చేశారు.. అని అంటున్నారు చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్. వైరాలజిస్ట్ అంటే ఏం లేదు.. వైరస్ లపై అధ్యయనం చేసే వాళ్లను వైరాలజిస్టులు అని పిలుస్తారు.

లిమెంగ్ యాన్ అనే శాస్త్రవేత్త కరోనా వైరస్ ను ల్యాబ్ లోనే తయారు చేశారు అని పెద్ద బాంబు పేల్చారు. అంతే కాదు..  కరోనా వైరస్ ను తయారు చేసిన విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా తెలుసట. ఆ వైరస్ ను సృష్టించి చాలా సంవత్సరాలు అయిందట. ఎప్పుడో సృష్టించినా.. దాన్ని భద్రంగా దాచి గత సంవత్సరం ప్రజలకు వ్యాప్తి చెందేలా చేశారు అంటూ సంచలన విషయాలను ఆమె పంచుకున్నారు.

నేను ఏదో ఊరికే అనడం లేదు. నా దగ్గర అన్ని ఫ్రూప్స్ ఉన్నాయి. నాకు ఈ విషయం తెలిసిందనే విషయం చైనా అధికారులకు తెలిసింది. నన్ను బంధించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను హాంకాంగ్ కు వచ్చేశా. నా దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ త్వరలో మీడియా ముందుకు తీసుకొస్తా. ఆ వైరస్ సింథటిక్ వైరస్.. అంటూ లిమెంగ్ యాన్ వ్యాఖ్యానించారు.

అందరూ అనుకుంటున్నట్టుగానే ఆ వైరస్ వూహాన్ ల్యాబ్ లోనే సృష్టించబడింది. వైరస్ జన్యూపటం సేమ్ మనిషి వేలి ముద్రలా ఉంటుంది. దాన్ని ఏ సైంటిస్ట్ అయినా గుర్తించగలడు.. అంటూ లీ తెలిపారు.

చైనా ఇదంతా కావాలని చేసిందని.. ప్రపంచదేశాలను తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవడం కోసమే ఈ కుట్ర పన్నిందని లీ ఆరోపించారు. తనకు ఎప్పటికైనా ప్రాణ హానీ ఉందని… అందుకే తాను అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టు వీడియో ఇంటర్వ్యూలో తెలిపారు.

కరోనా వైరస్ గురించి ఇప్పటికే ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. అది వూహాన్ ల్యాబ్ లోనే పుట్టిందని ఇప్పటికే చాలామంది ఆరోపించినప్పటికీ.. ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ లోనే సృష్టించబడింది.. అని చెప్పడానికి తన దగ్గర బోలెడు ఆధారాలు ఉన్నాయని లీ.. ఆరోపిస్తోంది.

చూద్దాం.. లీ తన దగ్గర ఉన్న ఆధారాలను బయటపెడుతుందా? లేదా? ఒకవేళ బయటపెడితే.. చైనా పరిస్థితి ఏంటి? చైనాను ప్రపంచ దేశాలు నిర్మొహమాటంగా బహిష్కరించి తీరుతాయి. ఇది మాత్రం సత్యం.

https://twitter.com/suciacelina/status/1304483559873351686


https://twitter.com/BeholdIsrael/status/1304916933687390209