డ్రాగన్ దేశం చైనా ప్రపంచం మీద పగ తీర్చుకోమని కరోనా వైరస్ కి పురుడు పోసి పంపించిన సంగతి తెలిసిందే. వైరస్ వచ్చిన కొత్తలో వూహాన్ సహ పలు ప్రాంతాల్లో జనాలు రోడ్లపై పిట్టల్లా రాలిపోయిన సంఘటనలున్నాయి. ఇప్పుడా పరిస్థితులు మిగతా దేశాలకు వచ్చింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమైన చైనాలో కరోనా కేసులు లక్ష కూడా నమోదు కాలేదు. కేవలం 85 వేలతో చైనా వైరస్ ని కట్టడి చేయగల్గింది. దీంతో మేలో అన్ని సేవలకు అన్ లాక్ పడింది. ఇక నాటి నుంచి చైనా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో చూస్తున్నాం. అడఅడపా దడపా కేసులు నమోదైనా! హోమ్ క్వారంటైన్ లో ఉంటూనే తగ్గించుకుంటున్నారు.
దీని వెనుక మరో రహస్యం కూడా వినిపిస్తోంది. డ్రాగన్ దేశం వ్యాక్సిన్ కనిపెట్టిందని..ప్రస్తుతానికి కేవలం ఆదేశ ప్రజానీకం కోసమే వాడుతున్నరు అన్నది ఓ వాదన. ఆ సంగతులు పక్కనబెడితే చైనా జనాల దాష్టికాలు రోజు రోజుకి పెట్రోగిపోతున్నాయి అన్నది వాస్తవం. ఓ వైపు చైనా మినహా ప్రపంచ దేశాలన్ని కరోనాతో యుద్ధం చేస్తుంటే చైనా జనాలు మాత్రం యథేశ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య చైనా వాసులంతా ఓ భోజన శాలలో సమావేశమైన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలకు పూర్తిగా తూట్లు పొడిచారు అని ఆ వీడియోతో తేటతెల్లమైంది.
తాజాగా కరోనా జన్మస్థానమైన వూహాన్ లో జనాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే షాక్ అవ్వాల్సిందే. అక్కడ వాటర్ పార్కులు తెరుచుకోవడంతో జనాలంతా ఎంజాయింగ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వూహాన్ లోని మాయా వాటర్ పార్క్ లో బికినీలతో, పొట్టి నిక్కర్లలో ఎంజాయ్ మెంట్ ని షురూ చేసారు. మే నెల నుంచి ఒక్క కేసు కూడా లేకపోవడంతో అక్కడ జనాలంతా కొవిడ్ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. అయితే కరోనాని జనాలు మర్చిపోయినా కరోనా జనాల్ని మర్చిపోదు అన్న విషయాన్ని విస్మరించారు అనడానికి ఇదొక ఉదాహరణ. కోవిడ్ నిబంధనలు పాటించకుండా వాటర్ పార్క్ లో ఇలా సేద తీరడాన్ని చైనా భాషలో ఎలా దండిస్తారో తెలియదు. ఇండియాలోనూ అందులోనే తెలుగులో అయితే సిగ్గు శరం లేకుండా బరి తెగించడం అని అంటారు.