భారత్ తో కయ్యానికి కాలు దువ్విన చైనా చివరికి తోక ముడిచింది. సరిహద్దులో వేసిన గుడారాలను..యుద్ధ సరంజామాని రెండు కిలోమీటర్ల వెనక్కి తరలించారు. మోదీ పర్యటన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఇక అప్పటికే భారత్-చైనా సైన్య అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో మోదీ లద్దాఖ్ పర్యటించారు. ఆయన పర్యటించిన మూడు రోజులకే చైనా భారత్ తో చర్చలు సఫలమయ్యాయి అంటూ తోక ముడిచి వెనక్కి తగ్గింది. గాల్వానా లోయలో అక్రమంగా సరిహద్దుల్లో వేసిన గుడారాలను కూడా తొలగించినట్లు చైనా అధికారులు తెలిపారు. చర్చల్లో భాగంగా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు బఫర్ జోన్ నిర్ధేశించుకున్నారు.
భారత్ కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే కేవలం చర్చల్లో భాగంగానేనని..ఆ ప్రాంతాన్ని చైనాకి అప్పగించినట్లు కాదని అధికారులు పేర్కొన్నారు. అయితే చైనా ఇలా హుటాహుటిన వెనక్కి తగ్గడానికి కారణంగా మోదీ పర్యటనతో పాటు, ప్రపంచ దేశాల మద్దతు భారత్ కు దక్కడంతోనే డ్రాగన్ స్పీడ్ తగ్గించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి అవి సఫలమైనా..చైనా మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడేది. కానీ మోదీ పర్యటన సందర్భం..అమెరికా, ప్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు మద్దతు ప్రకటించడం వంటి చర్యలకు చైనా గుండెల్లో రాయి పడినట్లు అయిందని..అందుకే వెనక్కి తగ్గినట్లు మాజీ మేజర్ స్థాయి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే చైనాని నమ్మడానికి లేదంటున్నారు. కుక్క తోక వంకర మాదిరి తన చైనా మళ్లీ తన బుద్దిని చూపించే ప్రయత్నం మానుకోదని హెచ్చరిస్తున్నారు. గాల్వానా ఘర్షణ తర్వాత అలాంటి చర్యలకే పాల్పడిందని, ఇప్పుడు రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లినా..మళ్లీ విషం చిమ్మడానికి ప్రయత్నిస్తుందని..అందుకు భారత సైన్యం ఎప్పుడూ సిద్దంగా ఉండాలని సూచించారు. అలాగే భారత సైన్యాన్ని ఢీ కొట్టడం చైనాకి అంత ఈజీ కాదని…భారత బలగాల శక్తి సామార్ధ్యాలు చైనాకు బాగా తెలుసునని అభిప్రాయపడ్డారు.