ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలో ఒక డైలాగు ఉంటుంది, గురువు గారు గురువు గారు అంటూ గుండెల మీద తన్నావు కదరా..అని అచ్చం ఇప్పుడు అదే డైలాగు తిరుపతి రాజకీయంలో ఇద్దరు నేతలకు సరిపోతుంది, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా ఒకప్పటి గురు శిష్యులు, కానీ నేడు బద్ద శత్రువుల గా మారిపోయారని అంటున్నారు తిరుపతి ప్రజలు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నకాలంలో చెవిరెడ్డిని అయన వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసింది భూమనకరుణాకర్ రెడ్డి ఆ కారణంతోనే అప్పుడప్పుడు భూమన నా రాజకీయ గురువని చెవిరెడ్డి చెపుతుంటాడు. 2012 లో చిరంజీవి రాజీనామా తర్వాత తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల్లో భూమన గెలిచాడు, 2014 ,2019 లో చెవిరెడ్డి చంద్రగిరి నుండి భారీ మెజారిటీ తో గెలిచి, కీలకమైన నేతగా ఎదిగాడు, ఇక జగన్ ప్రభుత్వంలో చెవిరెడ్డి కి ఒకటికి మూడు పదవులు దక్కాయి.
ఎమ్మెల్యే పదవి కాకుండా పార్టీ విఫ్,తుడా ఛైర్మన్,టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పదవులు వచ్చాయి, భూమన కు మాత్రం కేవలం ఎమ్మెల్యే పదవి తప్ప మరొకటి లేదు. పైగా తుడా చైర్మన్ అయినా చెవిరెడ్డి ఎక్కువగా పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తూ దూసుకుని వెళ్తున్నాడు, దీనితో అక్కడి స్థానిక ఎమ్మెల్యే అయినా భూమన కరుణాకర్ కు ఆయన అనుచర వర్గానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. తిరుపతిలో చెవిరెడ్డి పెత్తనం చేయటం మీద భూమన అనుచర వర్గాలు భగ్గుమంటున్నాయి.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య పోటీ పెరిగిపోతుంది, నా నియోజకవర్గంలో చెవిరెడీ ఇన్వాల్మెంట్ ఏంటి అంటూ భూమన,,, తుడా చైర్మన్ కాబట్టి తిరుపతి కార్యక్రమాల్లో నా పాత్ర లేకుండా ఎలా ఉంటుందని చెవిరెడ్డి మాట్లాడుతున్నారు . ఇప్పటికే మంత్రి పదవి రాకపోవటంతో అసంతృప్తి తో వున్న భూమన కరుణాకర్ కు కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ తలనొప్పిగా మారాడని అక్కడి స్థానిక ద్వితీయ శ్రేణి నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఒకే ప్రాంతంలో ఒకే పార్టీ నుండి ఇద్దరు బలమైన నేతలు పోటీపడటం వలన ప్రత్యూర్ది పార్టీలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే రేపొద్దున ఎన్నికల్లో జగన్ కు ఇది మరో సమస్య కావటం ఖాయం