Beauty Tips: పీసీఓఎస్, మోనోపాజ్, హైపర్ మరియు హైపోథైరాయిడిజం, వంటివి ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాం. ముఖ్యంగా భారత దేశంలో చాలా మంది మహిళలు ఈ సమయాలలో ఒకదాన్ని ఎదుర్కొంటున్నారు. లైఫ్ స్టైల్ మార్పులు ఆహార మార్పులు, ఉద్యోగ ఒత్తిడి మొదలైనవి కారణాలు. అయితే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల చాలా మంది స్త్రీలు చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. మొటిమలు, స్కిన్ పిగ్మెంటేషన్ మరియు రంగు మారడం, మొహం మీద అవాంఛిత రోమాలు రావడం వంటివి సాధారణ సమస్యలు అయిపోయాయి. కొన్ని మార్పులు మన లైఫ్ స్టయిల్ లో చేసుకోవడం ద్వారా వీటిని నియంత్రించవచ్చు.
ఆహారం ఆరోగ్యకరంగా:
శుభ్రమైన శాఖహారం తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ మరియు మంచి కొవ్వులు శరీరానికి అందుతాయి. బయటి చిరుతిండ్లకు నూనెలో వేయించిన ఆహారపదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది.
చెక్కర మరియు ఉప్పు కూడా దూరంగా:
మన రోజువారీ ఆహారంలో చెక్కరకు బదులుగా తేనె లేదా బెల్లం తీసుకోవడం వల్ల శరీరం లోని ఇన్సులిన్ స్థాయిలు పెరగవు అలాగే శరీర బరువు తగ్గడం లో సహాయ పడుతుంది.ఉప్పు వీలైనంత తగ్గించడం ద్వారా కూడా బరువును అదుపులో ఉంచుతూ జీవక్రియ వేగాన్ని పెంచొచ్చు. ఆకుకూరలు, తాజా పళ్ళు, డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చుకోవాలి. అన్నం బదులుగా తృణ ధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
మంచి నిద్ర:
మంచి నిద్ర చర్మ ఆరోగ్యం పై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. తగినంత నిద్ర లేకపోవడం కార్టీసాల్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది మంటను సృష్టిస్తుంది మరియు చర్మ ప్రకాశాన్ని తగ్గిస్తుంది.
చమట చిందిస్తే చర్మానికి మంచిదే.వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువును అదుపులోపెట్టడంతో పాటు చర్మం లోని మలినాలు శుభ్రం పరచుకుని కాంతివంతంగా చేసుకోవచ్చు. నీరు ఎక్కువగా తీసుకోవడం పళ్లరసాలు చెక్కరలేకుండా తీసుకోవడం రోజు అరగంట అయినా వ్యాయామం చర్మసౌందర్యాన్ని పెంచుతాయి. వీటితో పాటు గ్రీన్ టీ, మోజారెలా టీ కూడా తీసుకుంటే జీవక్రియ వేగాన్ని పెంచి శరీరం లోని వ్యర్థాలు బయటికి పంపి శరీరాన్ని చర్మాన్ని శుభ్రపరుస్థాయి.
కెమికల్ ఫ్రీ సౌందర్య సాధనాలు:పారాబీన్ ఫ్రీ సిలికాన్ ఫ్రీ సబ్బులు క్రీంలు వాడటం ద్వారా చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.