నేడు ఆకాశంలో అద్భుతం. ఆకాశంలో పూర్తి స్థాయిలో వలయాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.16 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 గంటల వరకూ సూర్య గ్రహణం ఉంటుంది. దేశంలో తొలిసారి గుజరాత్ లో కనిపించనుంది. తెలంగాణలో 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకూ 51 శాతం కనిపిస్తుంది. ఇక ఏపీలో 10.21 నుంచి మధ్నాహ్నం 1.49 గంటల వరకూ 46 శాతం కనిపిస్తుందని ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ తెలిపారు. మరి సూర్యగ్రహణ ప్రభావం మహమ్మారి కరోనాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సూర్యగ్రహణం కరోనాకి చెక్ పెడుతుందా? వలయాకార సూర్యగ్రహణ సమయంలో వెలువడే అతినీల లోహిత కిరణాలకు అంత శక్తి ఉందా? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి.
అతినీల లోహిత కిరణాల కారణంగా కరోనా వైరస్ 0.001 శాతం నశించే అవకాశం ఉందని శాస్ర్తజ్ఞులు అభిప్రాయపడ్డారు. ఇది కేవలం అంచనా మాత్రమేనని ఆ శాతం పెరిగే అవకాశం ఉంటుంది తప్ప! తగ్గడానికి ఛాన్స్ ఉండదని అంటున్నారు. సాధారణంగా వేడి వాతావరణంలో వైరస్ మనుగడ పెద్దగా ఉండదంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట వైరస్ ఉనికి తక్కువగా ఉంటుందని అంటున్నారు. తాజాగా వెలువడే అతి నీల లోహిత కిరణాల ప్రభావం భూమ్మీద ఎక్కువగా ఉండటం అనేది కరోనాకి ప్రతికూల అంశమని స్పష్టం చేసారు. వీటి ఆధారంగానే జ్యోతిష్యులు సహా పలువురు కరోనాకి నేటితో మానవ మనుగడకు ముగింపు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని పేర్కొన్నారు.
ఇంకొందరు జూన్ 21 తో యుగాంతం అని సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపారు. కరోనా సమయంలో సూర్యగ్రహణం రావడంతోనే! ఇలా కొందరు అర్ధం లేని ప్రచారం మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇది పూర్తిగా అవాస్తవాలు అని నిజా నిజాలు తెలియకుండా ఇష్టానుసారం కథనాలు ప్రచారం చేయడం తగదన్నారు. గతంలోనూ యుగాంతం అంటూ పలు కథనాలు ప్ర్రజల్లో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.