బోర్ కొట్టించేస్తున్న ఛార్మి: అంత అవసరమా.?

ఒకప్పుడు ఛార్మి అంటే స్టార్ హీరోయిన్. పర్ఫామెన్స్‌తో పాటు, ఎలాంటి మొహమాటం లేకుండా అందాల ఆరబోసేయడంలోనూ ఛార్మి టాప్. డైరెక్టర్ ఎంత చెబితే, అంత.. ఎలా అంటే అలా.. తెరపై గ్లామర్ తళుకులు మెరిపించిన ముద్దుగుమ్మ.అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అన్నా కూడా అప్పట్లో ముందుగా గుర్తొచ్చే పేరు ఛార్మినే.

‘జ్యోతిలక్ష్మి’ సినిమా తర్వాత ఎందుకో ఛార్మి సినిమాలకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా మారిపోయిన సంగతి తెలిసిందే. పూరీతో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో లేటెస్టుగా ‘రొమాంటిక్’ సినిమాని నిర్మించింది ఛార్మి. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యూత్ టార్గెట్‌గా బాగానే దూసుకెళ్తోందనుకోండి.

అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘నాకు హీరోయిన్ ఛాన్సులొస్తున్నాయ్. కానీ..’ అంటూ పదే పదే డబ్బా కొడుతోంది. ఒకవేళ హీరోయిన్ ఛాన్సులే వస్తుంటే, నటించొచ్చు కదా.. వస్తున్నాయ్ మొర్రో అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమెందుకు.? లేదంటే, తన సొంత బ్యానర్‌ సినిమాల్లోనే స్టన్నింగ్ రోల్స్‌లో కనిపించినా సరిపోతుంది.. అలాంటిది ఛార్మి ఎందుకలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటోంది.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

పదే పదే ఒకే మాట చెబితే అంతే మరి, అలాగే బోర్ కొట్టేస్తుంది. ఎందుకలా సిల్లీ డైలాగులతో ఛార్మి బోర్ కొట్టించేస్తోందో. ఆ మాటల వెనుక ఛార్మి ఆంతర్యమేంటో.!